Kannada actor sudeep praises telugu director rajamouli

kannada actor sudeep, sudeep latest news, sudeep rajamouli, rajamouli latest news, sudeep comments rajamouli, rajamouli comments sudeep, eega movie news, sudeep eega movie

Kannada actor sudeep praises telugu director rajamouli : Kannada super star kiccha sudeep praises telugu ace director rajamouli. he said rajamouli is the only one person who know the movie language and more

ఆ బాష జక్కన్నకే వచ్చుట

Posted: 08/06/2014 04:43 PM IST
Kannada actor sudeep praises telugu director rajamouli

రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా ఈ శతాబ్దపు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేని వ్యక్తి. ఆయన తీసిన సినిమాలు టాక్ ఆఫ్ ది రికార్డ్స్. సినిమా అంటే రాజమౌళి, రాజమౌళి అంటే సినిమాలా మారిపోయింది ఇప్పుడున్న ఇండస్ర్టీ.. ఆయన దర్శక నైపుణ్యాన్ని మెచ్చుకోని, ప్రశంసించని వారు ఎవరూ లేరు. తాజాగా ఈ వరుసలో సుదీప్ చేరిపోయాడు.

కొద్ది రోజుల క్రితం విడుదలైన మాణిక్య అనే కన్నడ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సుదీప్.., జక్కన్న అదేనండి మన రాజమౌళి గురించి రెండు మాటలు చెప్పాడు. రాజన్న ఓ అరుదైన దర్శకుడుగా ప్రశంసించారు. సినిమా బాష పూర్తిగా అతనికే తెలుసని కితాబిచ్చారు. అంతేకాదు ఎస్.ఎస్ మాట్లాడినా.., ఏదైనా పనిచేసినా అందులో సినిమా కన్పిస్తుందట. ఒక నటుడి బలమేంటో.., బలహీనతేంటో పూర్తిగా తెలిసిన దర్శకుడు రాజమౌళి అని సుదీప్ కితాబిచ్చాడు.  నటులను, వారిలోని నటనను వెలికి తీసి ప్రోత్సహించటంలో రాజన్నకు ఆయనే సాటి అని సుదీప్ చెప్పాడు.

ఇక సుదీప్ విషయానికొస్తే.., తెలుగు మిర్చి కన్నడ రీమేక్ మానిక్య విజయం సాధించింది. ప్రస్తుతం మనవాడి చేతిలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు కత్తి, బాహుబలి ఉన్నాయి. వీటిపైనే కెరీర్ గ్రోత్ ఆశలతో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles