బాలీవుడ్ సినీరంగంలోకి ఒక నటిగా తన తండ్రి పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తానని, డబ్బు, పేరు ప్రఖ్యాతలు అవసరం లేదని అప్పట్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ సోనమ్ కపూర్. కానీ ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడు చెప్పిన తన మాటలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. సినిమాల్లో హీరోయిన్లందరూ కూడా కాస్త గ్లామర్ గా కనిపించడం సాధారణమే. అయితే సోనమ్ మాత్రం ఐటెం భామలతో పోటీకి దిగే రేంజుకు దిగజారిపోయింది.
ఇటీవలే ఈ అమ్మడు ఓ హాట్ ఫోటోషూట్ లో పాల్గొని, ఆ ఫోటోలను నెట్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో సోనమ్ పోర్న్ స్టార్ లను మించిన రేంజులో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు చూసినవారందరూ కూడా సోనమ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే అదంతా ఆమె వ్యక్తిగత విషయమనుకుంటే... తాజాగా సోనమ్ మళ్లీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ దర్శక,నిర్మాతలకు మరో షాకిచ్చింది. ప్రస్తుతం సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో సోనమ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు నటిస్తున్న అన్ని చిత్రాలు విజయం సాధిస్తుండటం... పైగా ప్రస్తుతం సల్మాన్ తో చేసే అవకాశం రావడంతో టాప్ హీరోయిన్ గా ఫీలైపోతుంది.
దీంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను 5 కోట్లకు పెంచేసిందని తెలిసింది. తన దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు 5కోట్లు ఇస్తేనే చేస్తానంటూ నేరుగా చెప్పేస్తోందట. దీంతో ఈ అమ్మడు తనలో ఏం చూసుకొని.... తన రేటు పెంచేసుకుందో అర్థం కావట్లేదంటూ బాలీవుడ్ వర్గాలు గుసగుసలు పెడుతున్నారు. ఒకవేళ తన రేటు నచ్చక ఈ అమ్మడిని ఎవరూ సంప్రదించకపోతే... కొంచెం రేటు తగ్గిస్తుందో లేదో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more