Hero daggubati rana loses 100 crores for mahesh babu in the past

hero daggubati rana latest news, daggubati rana with mahesh babu, mahesh babu latest news, mahesh babu news, mahesh babu with daggubati rana, daggubati rana fires on mahesh babu, mahesh babu fires on daggubati rana, daggubati rana comments on mahesh babu, daggubati rana loses 100 crores

hero daggubati rana loses 100 crores for mahesh babu in the past

మహేష్ వల్ల రాణాకు 100 కోట్లు దెబ్బడిపోయాయట!

Posted: 07/30/2014 05:10 PM IST
Hero daggubati rana loses 100 crores for mahesh babu in the past

(Image source from: hero daggubati rana loses 100 crores for mahesh babu in the past)

టాలీవుడ్ ప్రిన్స్ గా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు, దగ్గుబాటి రాణాకు 100 కోట్లమేర నష్టం కలిగించాడని తాజా సమాచారం! దీంతో రాణా, మహేష్ మీద గుర్రుగా వున్నాడని, అతను కనిపించినప్పుడల్లా ‘‘నీవల్ల నేను వందకోట్లు నష్టపోయాను’’ అంటూ అందరిముందు తిట్టిపోస్తుంటాడని స్వయంగా రాణానే మీడియా సమక్షంలో పేర్కొన్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి ఏదైనా కంపెనీ పెట్టారా..? అని ఆందోళనల్లో మునిగిపోగా.. చివరికి రాణా ఈ విషయంమీద క్లారిటీ ఇచ్చేశాడు.

అప్పట్లో తమిళంలో రిలీజయి భారీగా విజయాన్ని సొంతం చేసుకున్న ‘‘గజినీ’’ సినిమాను మొదట దగ్గుబాటి రాణా తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడట! అందులో తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కించాలని భావించాడట రాణా! అయితే అందుకు వెంకీ, రాణాతో ‘‘గజనీలో సూర్యలాంటి బాడీని బిల్డప్ చేయడం ఎక్కడ సాధ్యమవుతుంది. నావల్ల కాదు’’ అని చెప్పడంతో ఆ ప్రాజెక్టు గురించి మహేష్ కి వివరించినట్టు పేర్కొన్నాడు. అయితే అటువంటి సినిమాలు తెలుగులో వర్కవుట్ కావని మహేష్ బాబు సున్నితంగా ఆ సినిమాను తిరస్కరించేశాడని రాణా చెప్పుకొచ్చాడు. దీంతో అతను ఆ సినిమా రీమేక్ హక్కులను తీసుకోకుండా వదిలేశాడని స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలోనే ఆ సినిమా డబ్బింగ్, రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ వారు సొంతం చేసుకుని.. ఆ చిత్రాన్ని తెలుగులో, హిందీలో నిర్మించి భారీ విజయాలను మూటగట్టుకున్నారని అతను పేర్కొన్నాడు. ఒకవేళ మహేష్ అప్పుడే ఒప్పుకుని వుండుంటే ‘‘గజని’’ సినిమాను తమ సంస్థ ద్వారా తెలుగు, హిందీ భాషల్లోనూ నిర్మించేవాడని అతను మీడియాతో పేర్కొన్నాడు. కానీ మహేష్ ఒప్పుకోకపోవడం వల్ల తాను నష్టపోయానని చెప్పిన ఆయన... మహేష్ కనిపించినప్పుడల్లా ‘‘నీవల్ల నేను వంద కోట్లు లాస్ అయ్యాను’’ అని అన్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాల్లో హీరోగా రావడానికి రానా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అప్పట్లో భావించినట్లు ఆయన తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles