Ram gopal varma praises kcr and discourage chandrababu naidu

Ram Gopal Varma praises cm kcr and discourage cm chandrababu naidu, ram gopal varma latest news, ram gopal varma praises telangana cm kcr, ram gopal varma twitter account, ram gopal varma tweet on telangana cm kcr, ram gopal varma tweet on kcr, ram gopal varma controversial comments on kcr, ram gopal varma comments on chandrababu naidu, ram gopal varma comments on mahatma gandhi

Ram Gopal Varma praises telangana cm kcr and discourage andhra cm chandrababu naidu

పైసలకు ఆశపడి కేసీఆర్ ని పొగిడిన వర్మ!

Posted: 07/24/2014 03:38 PM IST
Ram gopal varma praises kcr and discourage chandrababu naidu

రాంగోపాల్ వర్మ ఎప్పుడు, ఏం చేసినా కొంచెం వెరైటీగా వుంటుందని తనకుతానే డప్పు వాయిచుకోవడం ఆయనకు అలవాటు! తాను చెప్పిందే వేదమంటూ ప్రముఖుల మీద తనకిష్టమొచ్చినట్లు కామెంట్లు చేసి సంచలనాలను సృష్టిస్తుంటాడు. ఎవరు అడ్డొచ్చినా, ఏం చెప్పినాగానీ వారి గురించి, వారు చెప్పిన మాటల గురించి పట్టించుకోకుండా ‘‘నా దారి రహదారి’’ అంటూ వివాదాస్పదాలను క్రియేట్ చేస్తుంటాడు వర్మ. ఇతను వ్యంగ్యంగా కామెంట్లు చేయని ఏ ప్రముఖులు మిగలలేదు. ఇటు చిత్రపరిశ్రమతోపాటు రాజకీయ నాయకులను కూడా తనదైన స్టైల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తుంటాడు.

ఈ నేపథ్యంలో గతంలో రాంగోపాల్ వర్మ పవన్ ని పార్టీపెట్టాలంటూ ఆయన్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. చాలావరకు పవన్ పార్టీ పెట్టడంలో వర్మ కూడా కొంతమేరకు కీలకపాత్రను పోషించాడనే చెప్పుకోవాలి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ‘‘ఆయన ఎంతో అందంగా వుంటాడని, ఆయన అందానికి ఆయనే సాటి’’ అంటూ వర్మ చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కేసీఆర్ ను పొగుడుతూ కామెంట్లు చేశాడు. అంతటితో ఊరుకోలేదు... కేసీఆర్ ను పొగుడుతూనే ఆంధ్రాముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేవిధంగా ట్విటర్ లో తన భావాలను వ్యక్తపరిచాడు. కేసీఆర్ లాంటి మంచి సీఎం మన యావత్తు భారతదేశంలో లేడని, ఆయన లాంటి మహామనిషి ఇంతవరకు పుట్టలేదంటూ ట్వీట్ చేసిన వర్మ... చంద్రబాబు, కేసీఆర్ నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలంటూ తీవ్ర విమర్శలను గుప్పించాడు.

‘‘మహాత్మాగాంధీ, బాల్ థాక్రే వంటి మహామనుషుల కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరు ఎంతో అద్భుతంగా వుంది. కేసీఆర్ ను చూసి ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు చాలా నేర్చుకోవాల్సి వుంది. ఈ విషయం ఎవరు ఏమనుకున్నా నాకు ఫర్వాలేదు. ఎందుకంటే నేను తెలంగాణాలో పుట్టాను... ఇక్కడే పెరిగాను... నా హృదయం తెలంగాణాతోనే వుంది’’ అంటూ రాంగోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. మరి రానురాను ఈ ట్వీట్ ఎన్ని వివాదాలను రేకెత్తిస్తుందో..!?

అయితే ఇటీవలే సీఎం కేసీఆర్ పాకిస్తాన్ కోడలు, భారత టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాంతోపాటు ఆమెకు కోటీరూపాయలు కూడా సమర్పించాడు. దీంతో వర్మ కూడా సానియామీర్జాలా క్రెడిట్ పొందాలనే ఆశతోనే వర్మ ఈ విధంగా కేసీఆర్ ను పొగుడుతున్నాడని, తనను తాను పదేపదే తెలంగాణ బిడ్డ అంటూ చెప్పుకుంటున్నాడని విమర్శకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles