Ramcharan tej in comedy movie

Ramcharan Tej in comedy movie, Ramcharan under Srinu Vaitla direction, Ramcharan in full length comedy movie

Ramcharan Tej in comedy movie under Srinu Vaitla's direction

విభిన్నమైన పాత్రలో రాబోతున్న చెర్రీ!

Posted: 07/20/2014 10:55 AM IST
Ramcharan tej in comedy movie

ఇప్పటివరకు యాక్షన్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన రామ్ చరణ్ తేజ్ ఇంతవరకూ చూపించని సరికొత్త ప్రతిభను చూపించబోతున్నారని వార్త.  మరో విశేషం- రామ్ చరణ్ వెంటవెంటనే సినిమాలకు ఒప్పుకోవటం.  

కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న "గోవిందుడు అందరివాడేలే" సినిమా  ఇంకా పూర్తవనేలేదు, అప్పుడే మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.  ఇదీ విశేషమే- ఇంతవరకు జరగనిది.  గోవిందుడు అందరివాడేలే సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది.  అయితే అప్పటివరకు ఆగటం లేదు రామ్ చరణ్.  

శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోయే సినిమాకి అప్పుడే కథంతా సిద్ధమైంది,  దానికి రామ్ చరణ్ ఓకే చెప్పటంతో నవంబర్ నుంచి షూటింగ్ కి కూడా సన్నద్ధమవుతున్నారు.  

ఈ సినిమా పూర్తి నిడివి హాస్యప్రధాన చిత్రమట.  ఇందులో రామ్ చరణ్ హాస్య రసాన్ని చిందించబోతున్నారు.  మెగా స్టార్ తో సహా సినిమా హీరోలలో చాల వరకు హాస్య రస భరిత పాత్రలను పోషించినవారే.  నిజానికి  హాస్యాన్ని కూడా పండించినప్పుడే నిజమైన నటుడు అనిపించుకుంటారెవరైనా.  జంజీర్ లో రామ్ చరణ్ నటన చూసి 'స్టోన్ ఫేస్' అన్నవాళ్ళు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఏమంటారో చూడాలి!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles