Priyanak chopra escape from death

Priyanak Chopra escape from death in ad shooting, priyanka chopra latest news, priyanka chopra escape from death, priyanka chopra news, priyanka chopra in ad shooting, priyanka chopra stunts in ads, priyanka chopra stunts in advertisements, priyanka chopra hot photos, priyanka chopra hot photo shoot

Priyanak Chopra escape from death in ad shooting

చావు అంచులదాకా వెళ్లి బయటపడ్డ ప్రియాంక!

Posted: 07/16/2014 12:04 PM IST
Priyanak chopra escape from death

(Image source from: Priyanak Chopra escape from death in ad shooting)

బాలీవుడ్ హాట్ స్టార్ ప్రియాంక చోప్రా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. వరుస సినిమా విజయాలతో చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్న ఈ భామకు డేంజరస్ స్టంట్స్ చేయడం ఎంతో ఇష్టమని గతంలో పేర్కొంది. అందులో భాగంగానే ఈమె డాన్, డాన్ 2 సినిమాల్లో కొన్ని ప్రత్యేకమైన స్టంట్స్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తాజాగా మేరీకోమ్ సినిమాలోనూ బాక్సర్ గా నటించనుంది. అలాగే కొన్ని యాడ్ లలో కూడా ఈమె నటించింది.

ఈ నేపథ్యంలో ఆమె ఒక యాడ్ కోసం డేంజరస్ స్టంట్స్ చేయడానికి ఒప్పుకుంది. ఆ యాడ్ షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాం గాల్లో నుంచి కిందకు దూకాల్సి వుంటుంది. ఇందుకు తగిన విధంగా జాగ్రత్తలు కూడా తీసుకుంది. కానీ ఈ ఫీట్ చేస్తున్నప్పుడు ఆమె రక్షణ కోసం చుట్టుకున్న వైరు.. పొట్టను బలంగా చుట్టేయడంతో ఆమెకు శ్వాస తీసుకోవడంలో కష్టంగా మారిపోయిందట! దాదాపు అరగంటసేపూ వరకు గాల్లోనే తేలాడిన ప్రియాంక... శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బందికి గురయిందని చెప్పింది.

పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో స్టంట్ మాస్టర్ వెంటనే గ్రహించి, ప్రియాంకచోప్రాను కిందకు దించారు. అప్పటికప్పుడే ప్రాథమిక చికిత్స చేయించడంతో ఆమె కోలుకుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా కూడా ఈ విన్యాసం తరువాత కొంతమేరకు భయపడిందని పేర్కొంది. డేరింగ్ విన్యాసాలు చేయడంలో తప్పు లేదు కానీ... అందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తొందరపడితే... ఇటువంటి సమస్యలు వస్తాయని కొంతమంది సినీవిశ్లేషకులు హితువు పలుకుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles