Actress samantha refuses offers to work with new heroes

Actress samantha refuses offers to work with new heroes, actress samantha latest news, samantha latest news, samantha hot photos, samantha hot photo shoot, samantha in alludu sreenu movie, samantha hot gallery, samantha news, samantha refuses to work with new heroes, samantha fesuses new heroes movie offers

Actress samantha refuses offers to work with new heroes

దర్శకనిర్మాతలకు షాకిచ్చిన సమంత!

Posted: 07/16/2014 10:48 AM IST
Actress samantha refuses offers to work with new heroes

టాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ... యాడ్ ల ద్వారా తీరిక సమయం లేకుండా అందరినీ కనువిందు చేస్తున్న హీరోయిన్ సమంత! ప్రస్తుతం ఈమె రేంజ్ రెండు పరిశ్రమల్లోనూ భారీగా వుంది. ఇప్పుడు ఈమె నటిస్తున్న సినిమాలలో దాదాపు అందరూ టాప్ హీరోలే! పరిశ్రమలో వున్న అందరూ హీరోయిన్లను వెనకు నెట్టేసి ముందుకు దూసుకుపోతోంది ఈ చెన్నై బ్యూటీ! పైగా ఈమె నటిస్తున్న సినిమాలన్నీ మాంచి కలెక్షన్లతో విజయాలు సాధిస్తున్నాయి. దీంతో ఈ అమ్మడి డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఈమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈమె ఇమేజ్ ను క్యాచ్ చేసుకోవడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకును ఇండస్ట్రీలో భారీ ఎంట్రీ కోసం ఈ చెన్నై బ్యూటీకి ఎక్కువ పారితోషికం సమర్పించి, తన కొడుకు సరసన ‘‘అల్లుడు శ్రీను’’ సినిమాలో నటింపజేశాడు. దాదాపు 5 కోట్ల వరకు ఈమెకు పారితోషికం ఇచ్చుకున్నట్లు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కొత్త హీరోలతో నటింపజేయడం ఎంతో విశేషమని కొంతమంది ఈమెకు కితాబు కూడా ఇచ్చేశారు. ఈ విషయాన్ని గమనించిన కొంతమంది కోలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా కొత్త హీరోలతో నటించాల్సిందిగా హీరోయిన్ సమంతను సంప్రదించినట్టు సమాచారం!

అయితే హీరోయిన్ సమంత మాత్రం ఎటువంటి మొహమాటం లేకుండా వారికి ‘‘నో’’ అని చెప్పేసిందట! కేవలం డబ్బులకు ఆశ పడి కొత్త హీరోలతో సినిమాలు ఒప్పుకుంటే కెరీర్ పాడైపోతుందనే ధోరణిలో వారికి సమాధానం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. దీంతో వారు ఒక్కసారి షాక్ కి గురయి, అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారట! ఒకవైపు కోలీవుల్ లో సూర్య, విజయ్, విక్రం లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న తాను... కుర్ర హీరోలతో సినిమాలు ఒప్పుకుంటే ఇహేజ్ డ్యామేజ్ అవుతుందని... భవిష్యత్తులో పెద్ద హీరోలతో నటించే అవకాశాలు కూడా కరువవుతాయని భావించి.... కొత్త హీరోలతో నటించేందుకు తిరస్కరించిందని అందరూ అనుకుంటున్నారు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేముందు దేనికైనా రెడీ అనే భామలు... పేరు సంపాదించిన తరువాత ఎందుకిలా వ్యవహరిస్తారోనని సినీవిశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles