Reasons behind kamal vishwaroopam 2 delay

reasons for kamal vishwaroopam 2 delay, reasons for vishwaroopam 2 delay, actor kamal hasaan,vishwaroopam2 movie,vishwaroopam movie sequal, vishwaroopam movie release date, actress pooja kumar, kamal hasaan upcoming movie, uththama villain movie

Reasons behind Kamal Vishwaroopam 2 delay

కమల్ చెప్పేదాంట్లో నిజమెంతా ?

Posted: 07/08/2014 03:48 PM IST
Reasons behind kamal vishwaroopam 2 delay

ఏ హీరో సినిమా అయిన ప్రకటించిన తేదీన విడుదల కాకపోతే దానికి ఎన్నో కారణాలు వెతికి ఏదేదో ఊహించుకుంటారు. అక్కడ జరిగేది వేరు... వీరు ఊహించుకునేది వేరు. కొన్ని సందర్భర్బాల్లో సినిమా విడుదల ఆర్థిక కారణాల వల్ల ఆగిపోతే మాత్రం సదరు సినిమా హీరోలు, దర్శక నిర్మాతలు ఏదో కారణం చెప్పి మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా తన సినిమా ‘విశ్వరూపం -2’ పై అదే చెబుతున్నాడా ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈయన ప్రస్తుతం తన స్వీయ దర్శక నిర్మాణంలో నటిస్తూ ‘విశ్వరూపం -2 ’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు రమేష్‌ అరవింద్‌  ‘ఉత్తమ విలన్ ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో మొదట ‘విశ్వరూపం -2 ’ సినిమా విడుదల కావాలి. విశ్వరూపం2లో చాలా విపరీతమైన గ్రాఫిక్‌ వర్క్‌ చేయాల్సి ఉన్నదని, ఇప్పటికే పని మొదలుపెట్టినప్పటికీ.. అది ఆలస్యం కావచ్చునని దీంతో సినిమా విడుదల జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నాడు కమల్. కమల్ మాటల్ని బట్టి చూస్తుంటే ‘ఉత్తమ విలన్ ’ సినిమానే ముందుగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంత వరకు బాగానే ఉన్నా కమల్ చెప్పేదాంట్లో వాస్తవం ఎంతా అనే దాని పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విశ్వరూపం సినిమా సమయంలో ఉన్న ఆస్తులమ్మీ సినిమాను విడుదల చేశాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా తీస్తున్న దానికి ఆ సినిమా కంటే కాస్తంత బడ్జెట్ ఎక్కవగానే  పెట్టాలి కాబట్టి అంత డబ్బులు లేకపోవడంతోనే ఆలస్యంగా అవుతున్నా దాన్ని ఇలా ఏదో కారణం చెప్పి కవర్ చేస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా విశ్వరూపం2 సినిమా రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles