Salman kick trailer crosses 5 million views

Salman Kick trailer crosses 5 million views, Happy New Year,Kick,Salman Khan,Shahrukh Khan,YouTube record, Hrithik Roshan's Krish 3, amir Khan's Dhoom3, Director Sajid Nadiadwala

Shahrukh Khan fans fight on Twitter as Kick trailer crosses 6 million views

విడుదలకు ముందే సల్మాన్ కిక్ ఇస్తున్నాడు

Posted: 06/20/2014 12:25 PM IST
Salman kick trailer crosses 5 million views

బాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించాలంటే సల్మాన్ కే సాధ్యం అని మరోసారి నిరూపించాడు. బాలీవుడ్ బాక్సీఫీసును ‘దబాంగ్ ’ సినిమాతో 100 కోట్ల మార్కును తాకించి తన స్టామినా ఏంటో నిరూపించిన సల్మాన్ ఇప్పుడు  యూట్యూబ్ లో కూడా తన స్టామినా ఏంటో నిరూపించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటిస్తున్న ‘కిక్ ’ తెలుగు రీమేక్ సినిమా విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈయన నటిస్తున్న ‘కిక్ ’ ట్రైలర్ గత రెండు రోజుల క్రితం యూ ట్యూబ్ లో విడుదల అయ్యి   59 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్ సాధించి కొత్త రికార్డును సృష్టించింది.

అమీర్ ఖాన్ ధూమ్ సినిమా ఆరు రోజుల్లో నాలుగు మిలియన్ల వ్యూస్ సాధిస్తే. హృతిక్ రోషన్  క్రిష్ - 3  నాలుగు రోజుల్లో నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డుల్లోకి ఎక్కితే ఇప్పుడు ఆ రికార్డును సల్మాన్ ఖాన్ ‘కిక్ ’ సినిమా  బ్రేక్ చేసి ఇండస్ట్రీ జనాలకు కొత్త కిక్ ను ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన అనూహ్య రెస్పాన్స్ ను చూసి చిత్ర యూనిటే కాకుండా, దర్శకుడు సాజిద్ నదియా వాలా తెగ ఆనందపడిపోతున్నాడు.

దీని పై ఆయన మాట్లాడుతూ...   దీనికి అందరి నుండి పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందే దీని పై అందరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్లే  ఈసినిమా ఉంటుందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన పాట చిత్రీకరణ మహబూబ్  స్టూడియోలో జరుగుతుందని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పాడు. సల్మాన్ ఖాన్ తొలిసారి తెలుగులో డైలాగ్స్ చెప్పిన సినిమా బాలీవుడ్ లో మరెన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles