Pawan kalyan focuses on body weight loss

attarintiki daredi,gabbar singh,gopala gopala,jana sena party,lord krishna,oh my god,pawan kalyan,telugu remake of oh my god.

Pawan kalyan is on diet and exercise to loose some weight and to look slim like he does always on screen .

గ్లామర్ పెంచే పనిలో పడ్డ పవన్

Posted: 06/20/2014 10:20 AM IST
Pawan kalyan focuses on body weight loss

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు రాక చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించిన పవన్ తరువాత సినిమాల్లో బిజీ అవుతాడనుకుంటే రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో ఎనర్జిటిక్ గా, మార్షల్ ఆర్ట్స్ వచ్చిన ఏకైక హీరోగా ఉన్న పవన్ బాడీ స్పింగ్ యాక్షన్ లాగా ఉండేది. వయస్సు మీద పడుతున్న కొద్ది ఆయన శరీర బరువు లావెక్కడంతో, రాజకీయ క్యాంపెయిన్ వల్ల ఫేస్ లో గ్లామర్ తగ్గడంతో మళ్ళీ తిరిగి ఆ గ్లామర్ ని పొందడానికి కసరత్తులు ప్రారంభించాడు.

చాలా రోజుల తరువాత ‘గోపాల గోపాల ’ కు కమీట్ అయిన పవన్ ఈ సినిమా షూటింగుకు వెళ్లే లోగా పాత గ్లామర్ ని ఫేస్ లో కనిపించేలా డైట్ పాటిస్తున్నాడట. రోజు ఉదయం జిమ్, ఆహార నియపాలు పాటిస్తూ బాడీకి పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో పడ్డాడట.  పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రంగా రూపొందిస్తున్న ‘గోపాల.. గోపాల' ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.సురేష్‌బాబు, శరత్ మరార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ పార్థసాని దర్శకుడు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్న అనూప్ రూబెన్స్ మరో వారంలో పాటల రికార్డింగ్ పూర్తిచేయనున్నారు. అటు చిరంజీవి కూడా తన 150 చిత్రానికి కసరత్తులు మొదలు పెట్టాడు. వీరిద్దరు మళ్ళీ తెరపైకి వస్తే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవేమో.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles