Nayanatara charges rs 2 crores for own voice

Nayanatara charges Rs.2 crores, Actress Nayanatara, 2 crores for own voice, ‘Idhu Namma Aalu movie, shimbu-nayan

Actress Nayanatara has now charge huge remuneration of Rs.2 crores from the film makers for the forthcoming movie Idhu Namma Aalu.

డబ్బింగ్ చెప్పి 2 కోట్లు గుంజింది

Posted: 06/12/2014 08:11 PM IST
Nayanatara charges rs 2 crores for own voice

అవకాశాలు లేక ఖాళీగా ఉండనైనా ఉంటారు కానీ... ఎవరైనా అవకాశం ఇవ్వడానికి వస్తే వారి నుండి కావాల్సినంత పారితోషికం గుంజేస్తారు. సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారభించిన నయనతారకు అవకాశాలు ఏమాత్రం తగ్గక పోగా, ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో ఈ అమ్మడు దీనిని క్యాష్ చేసుకుంటుంది. తన పాత ప్రియుడు శింబు హీరోగా నటిస్తున్న ‘ఇదు నమ్మ ఆళు ’ సినిమాలో అడగ్గానే అమ్మడు బాగా ఆలోచించింది.

తమ కాంబినేషన్లో సినిమా అనగానే బిజినెస్ బాగా ఉంటుందన్న విషయం ఆమెకు తెలుసు. అందుకే, రెండు కోట్లు ఇస్తేనే చేస్తానందట. అదేంటని అడిగితే ఈ సినిమాలో శింబు సరసన నటించడమే కాకుండా, ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెబుతానని చెప్పిందట. దీంతో సదరు నిర్మాత బేరం ఆడినా ఏ మాత్రం తగ్గలేదట.

ఆ మధ్య తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచిన నయన్ ఇప్పుడు తమిళ సినిమాలో సొంత డబ్బింగ్ తో అలరించబోతుందన్న మాట. కేవలం భాష నేర్చుకొని నాలుగు మాటలు చెప్పినందుకు ఇంత వసూలు చేస్తుందటే, మిగతా హీరోయిన్లు  కూడా భాష నేర్చుకునే పనిలో పడ్డారట. ఇదేదో బాగుంది కదూ...

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles