Sunil bags big offer in dil raju banner

Sunil Bags Big Offer in Dil Raju Banner, Vasu Varma to Direct Sunil, vasu varma sunil movie, josh director film with sunil, sunil vasu varma film

Sunil Bags Big Offer in Dil Raju Banner, Vasu Varma to Direct Sunil, vasu varma sunil movie, josh director film with sunil, sunil vasu varma film

సునీల్ కి లక్కీ ఛాన్స్ తగిలింది

Posted: 06/10/2014 01:42 PM IST
Sunil bags big offer in dil raju banner

టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు ఎప్పుడు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలే తీస్తాడు. కానీ ఈయన తీస్తున్న సినిమాలు బడా సినిమాలు ఆయనకు అనుకున్నంతగా లాభాల్ని తెచ్చిపెట్టడం లేదు. అందుకే ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి సిద్దం అయ్యాడు. అందులో భాగంగానే టాలీవుడ్ హాస్య కథానాయకుడు అయిన సునీల్ తో ఈయన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు.

గతంలో దర్శకుడు వాసువర్మతో ‘జోష్ ’ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు అతనితోనే సునీల్ సినిమా తీయబోతున్నాడు. దీని గురించి దిల్ రాజు చెబుతూ, "నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుంది. విదేశాల్లో కథ మొదలై ఇండియాలో ముగుస్తుంది. మర్యాదరామన్న తరహాలో సునీల్ కి ఇది పేరు తెస్తుంది. ఆగష్టులో షూటింగ్ ప్రారంభిస్తాం" అని తెలిపారు.

ఇదిలా ఉంచితే, గతంలో వాసూవర్మ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు 'లవర్' అనే సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రాన్నే సునీల్ తో తీస్తున్నారా? అన్నది తెలియాల్సివుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అదే సినిమాను తక్కువ బడ్జెట్ తో తీసేద్దామనుకొని అల్లు అర్జున్ ని ప్రక్కన పెట్టి సునీల్ ని తెచ్చాడని అంటున్నారు.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles