Ram gopal varma satire on kcr face

Ram Gopal Varma Satire On KCR Face, Controversial director Ram Gopal Varma, Ram Gopal Varma Setires on KCR, Telangana Chief Minister, KCR

Controversial director Ram Gopal Varma Satire On Telangana Chief Minister KCR.

కేసిఆర్ ముఖాన్ని గజినీ కూడా మరచిపోలేడు

Posted: 06/10/2014 11:07 AM IST
Ram gopal varma satire on kcr face

ఒకప్పుడు తనదైన మార్క్ చిత్రాలతో ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలం నుండి మాత్రం వివాదాస్పద కామెంట్లు చేసి తిక్క వర్మగా పేరు తెచ్చుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కేవలం కాంట్రవర్సీల కోసమే వాడుకునే దర్శకుడు ఎవరంటే ముందు వరసలో ఉండేది రామ్ గోపాల్ వర్మే. ఆయన ఎప్పుడూ ఎవరో ఒకరి పై కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తలో నిలుస్తాడు. సినీ స్టార్ల దర్గర్నుండి రాజకీయ నాయకుల వరకు ఎవర్నీ వదలకుండా కామెంట్ చేస్తాడు.

ఉన్నట్లు ఉండి ఈసారి ఈయన కన్ను గులాబి దళపతి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పడింది. ఆయన చేసిన కామెంట్లు చూస్తే చదివే వారికి నవ్వోచ్చేలా... అర్ధం చేసుకునే వారికి వెటకారంగా ఉన్నాయి. కేసీఆర్ ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోలేరని, చివరకు గజనీ సైతం గుర్తు పెట్టుకుంటాడని అన్నారు. తనతో ఓ కాలేజ్ అమ్మాయి...కేసీఆర్ ముఖం చాలా అందంగా ఉంటుందని, ముఖ్యగా ఆయన ముక్కును, ఆయన్ను చాలా మంది అమ్మాయిలు ఇష్టపడారని చెప్పిందని... ఈ హైదరాబాద్ సిటీలో  కేసీఆర్ కనపడటాన్ని థ్రిల్ అవుతున్నానని, మరికొన్ని కటౌట్లు పెడితే బాగుంటుందని చెప్పిందని ఆయన ట్వీట్ చేశాడు.

ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఎటకారంగా ఉన్నట్లు లేవు... గత కొంత కాలం నుండి సిటీలో ఎక్కడ చూసినా కేసీఆర్ కటౌట్లే దర్శనం ఇస్తున్నాయి. ఇవన్నింటిని చూసిన ఆయన చిరాకు వచ్చిందే ఏమో.. అమ్మాయి చెప్పినట్లుగా చెబుతూ కేసీఆర్ పై కామెంట్లు చేశాడని అంటున్నారు. ఈ ట్వీట్ల పై టీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

అయినా ఇన్నాళ్ళు ఓ పార్టీ అధ్యక్షుడిగానే ఉన్న కేసీఆర్ ఇప్పుడు సాధారణమైన వ్యక్తి కాదు... ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన పై కామెంట్లు చేసేటప్పుడు కాస్తంత నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని వర్మను హెచ్చరిస్తున్నారు సినీ జనాలు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles