ఆ మధ్యన ‘విశ్వరూపం ’ కు ముందు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్మిన విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆ సినిమా తరువాత అప్పులు తీర్చేశాడు. అది వేరే విషయం. ఇప్పుడు ఆయన కూతురు శ్రుతి హాసన్ కూడా అప్పుల పాలై, తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని ముంబై వర్గాల సమాచారం. గత కొంత కాలంగా టాలీవుడ్ లో టాప్ రేసులో గొల్డెన్ లెగ్ పేరుతో దూసుకుపోతున్న శ్రుతి హాసన్ టాలీవుడ్ కి టాటా చెప్పి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనుకొని ముంబైలోని అంధేరి ప్రాంతంలో అంత్యంత భారీ బడ్జెట్ తో ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసింది.
ఇన్ని సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఆ ఫ్లాట్ కొనడానికి సరికోక పోవడంతో బ్యాంకునుండి కొంత రుణం తీసుకుంది. నెల నెలా కట్టాల్సిన ఇన్ స్టాల్ మెంట్ల కోసం శ్రుతి హాసన్ బ్యాంకు వారికి ఇచ్చిన చెక్ అకౌంటులో డబ్బుల లేకపోవడంతో అది కాస్త బౌన్స్ అయ్యిందట. శ్రుతి హాసన్ ఇచ్చిన చెక్ తో షాక్ తిన్న బ్యాంకు అధికారులు ఆమె నుండి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నారట.
అయితే ముంబై జనాలు మాత్రం శ్రుతి హాసన్ సంపాదించిన దానిలో చాలా వరకు జల్సాలకు, సోకులకు ఖర్చు చేస్తే ఇల్లు కొనడానికి డబ్బులు ఎలా ఉంటాయి ? డబ్బులు లేనప్పుడు అంత ఖరీధైన ఇల్లు కొనుక్కొని ఆర్థిక కష్టాలు తెచ్చుకోవడం అవసరమా ? అని ప్రశ్నలు వేస్తున్నారు. మరి శ్రుతి ఇచ్చిన చెక్ నిజంగానే బౌన్స్ అయ్యిందా ? లేక డబ్బులు ఎగ్గొట్టే ప్లాన్ ఏమైనా వేసిందా ? ఆమె నోరు విప్పితేగాని అసలు సంగతి తెలియదు.
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more