Aishwarya rai second innings with jaaj ba

aishwarya rai second innings with jaaj ba, aishwarya rai re entry with jaaj ba, aishwarya rai in sanjay gupta movie, aishwarya rai, aishwarya rai latest movie news, aishwarya rai movie updates, bollywood movie news, aishwarya rai in cannes 2014, aishwarya rai latest hot stills, aishwarya rai hot news,

aishwarya rai second innings with jaaj ba, aishwarya rai re entry with jaaj ba, aishwarya rai in sanjay gupta movie, aishwarya rai, aishwarya rai latest movie news, aishwarya rai movie updates, bollywood movie news, aishwarya rai in cannes 2014, aishwarya rai latest hot stills, aishwarya rai hot news,

అభిమానులకోసం ఐశ్వర్య విప్పుతుందా లేదా?

Posted: 05/23/2014 01:30 PM IST
Aishwarya rai second innings with jaaj ba

ప్రపంచ సుందరిగా పేరుతెచ్చుకున్న అందాలతార ఐశ్వర్యరాయ్ ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. త్వరలోనే సినిమాల్లో నటించబోతుందని గతకొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. కానీ తన కూతురు ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ చాలా బరువు పెరిగిపోయి ముద్దుగా, బొద్దుగా తయారయ్యింది. ఇక ఐష్ సినిమాల్లోకి రానట్లే అని అందరనుకున్నారు. కానీ వాళ్లందరి నోరు మూయించేలా ఐష్ మళ్లీ ప్రపంచ సుందరిలా, స్లిమ్, ఫిట్, సెక్సీగా తయారయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిలింఫెస్టివల్స్ లో అందరి చూపు ఐష్ వైపే.

అయితే ఐష్ త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రం ద్వారా ఐష్ మళ్లీ సినిమాల్లోకి రానుందని... అదే విధంగా మణిరత్నం తెరకెక్కించనున్న ఓ భారీ మల్టీస్టారర్ చిత్రంలో హీరో నాగార్జున సరసన జోడిగా నటించనుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అయితే తాజాగా ఐష్ ఓ చిత్రంలో నటించబోతుందని అధికారికంగా ప్రకటించాడు ఆ చిత్ర దర్శకుడు.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా తన ట్విట్టర్ ద్వారా ఐష్ తన సినిమాలో నటించనున్నట్లు తెలిపారు. ‘జాజ్ బా’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐష్ ఓ శక్తివంతమైన పాత్ర చేయనుందని, అదే విధంగా ఇందులోని పోరాటాలను ఎలాంటి డూప్ సహాయం లేకుండా తానే స్వయంగా చేయాలని ఐష్ నిర్ణయించుకుందని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఇలాంటి వార్తలే దర్శకులు మణిరత్నం, పి.వాసు వంటి దర్శకులు తెలియజేశారు. కానీ ఆ సినిమాలేవి సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. మరి ఈ సినిమా అయినా షూటింగ్ వరకు వెళ్తుందో లేక చిత్రీకరణకు ముందే ఆగిపోతుందో త్వరలోనే తెలియనుంది. ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఇన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా తాను ఏ విధంగా కూడా స్పందించకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత ఎక్కువవుతుంది. మరి అభిమానులకోసమైనా ఐష్ పెదవి విప్పుతుందో లేదో చూడాలి.


Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles