Chiranjeevi to host a tv reality show

Chiranjeevi host TV reality show, Chiranjeevi in Reality Show, Chiranjeevi back to films, 2014 elections,Mega star Chiranjeevi

Chiranjeevi might host a reality TV show, is the latest industry buzz doing the rounds.

బుల్లితెర పై సందడి చేయబోతున్న చిరు

Posted: 05/20/2014 10:15 AM IST
Chiranjeevi to host a tv reality show

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి, రాజకీయాల్లో గా మెగాస్టార్ గా మారుదామని అనుకొని రాజకీయ అరంగ్రేటం చేసినా ఆ ఇన్నింగ్స్  ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రాబోతున్నాడు. చిరంజీవి  150వ చిత్రం 2014 ఎన్నికల తరువాత ఉంటుందని గతంలో నే ప్రకటించారు. ఇటీవల వెలువడిని ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో సాధ్యమైనంత త్వరగా ఆ చిత్రాన్ని మొదలు పెట్టాలని పలువురి దర్శకుల దగ్గర కథలు కూడా వింటూ బిజీగా ఉంటున్నాడట.

ఈ చిత్రం ప్రారంభం అయ్యే లోగా ఈయన బుల్లితెర పై ఓ రియాల్టీ షోలో పాల్గొన బోతున్నాడని టాలీవుడ్ ఫిలిం వర్గాల నుండి సమాచారం వస్తుంది. తెలుగులో టాప్ మోస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్  నిర్వహించబోతున్న షోకి ఈయన హోస్ట్ గా వ్యవహరించాలని సదరు యాజమాన్యం చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు. ఇప్పటికే నాగార్జున అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి ’ ప్రోగ్రాంలో తెలుగులో నిర్వహిస్తున్నాడు.

త్వరలో ప్రారంభం కానున్న ఈ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి ధీటుగా చిరంజీవితో ఈ షోను చేయించనున్నట్లు తెలుస్తుంది. మరి మూడో ఇన్నింగ్స్ లో చిరు సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles