Nayantara doing item song in rajini lingaa

Nayantara doing Item song, Nayantara item song in lingaa, nayantara, rajinikanth, lingaa, anushka shetty, sonakshi sinha, k.s ravikumar

Nayantara doing an item number in Rajinikanth starrer Lingaa movie.

రజినీ కోసం నయన్ ఐటెంగాళ్ గా

Posted: 05/19/2014 06:36 PM IST
Nayantara doing item song in rajini lingaa

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార అంటే ప్రత్యేకమైన క్రేజ్. ఆమె ఎన్ని ఎఫైర్లు నడిపినా, సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా ఇప్పటికీ అవకాశాలు మాత్రం వెల్లువలా వచ్చిపడుతూనే ఉన్నాయి. కారణం ఆమె అందాలు, అభినయం వల్లే దర్శక నిర్మాతలు ఆమె వెంటపడుతున్నారు.

ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. గతంలో  చంద్రముఖి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నయనతార త్వరలో రజినీకాంత్ చేయబోయే ‘లింగా’ చిత్రంలో ఐటెం పాట చేయడానికి కమీట్ అయ్యిందని అంటున్నారు.

ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు ఐటెంగాళ్స్ గా మారిన నయన్ మాత్రం ఒక్క పాటంటే ఒక్కటి కూడా చేయలేదు. కానీ రజినీ సినిమా అనగానే ఆయన పై గౌరవంతో ఒప్పుకున్నట్లు తమిళ సినీ జనాలు అంటున్నారు. ఈ చిత్రానికి కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మస్తుంది. ఎఆర్ రహ్మాన్ సంగీతాన్ని అందిస్తుండగా అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హాలు రజినీ సరసన నటిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles