Rey movie to be postponed once again

Rey Movie to be postponed once again, Sai Dharam Tej Rey movie, YVS Chowdary film, Rey Movie postponed to 17th may, Rey movie once again postpone

Rey Movie to be postponed once again, Sai Dharam Tej Rey movie, YVS Chowdary film, Rey Movie postponed to 17th may, Rey movie once again postpone

ఒ‘రేయ్ ’ మళ్ళీ వాయిదా పడిందిరోయ్

Posted: 04/29/2014 06:19 PM IST
Rey movie to be postponed once again

ఏ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా ‘రేయ్ ’ మొదలు పెట్టారో కానీ, ఈ సినిమా ఇంత వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పటి వరకు అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. గతంలో ఆర్ధిక కారణాల వల్ల ఆగిన ఈసినిమా కిందా మీద పడి షూటింగు కంప్లీట్ చేసుకున్నా, విడుదలకు మాత్రం ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.

చివరగా మే 9న ఎట్టి పరిస్థితులలోనూ దీనిని విడుదల చేస్తున్నట్టు నిన్నటి వరకు దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి చెబుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు   దీనిని మే 17కి వాయిదా వేస్తూ తాజాగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి ఉండటమే అని చెప్పుకొస్తున్నాడు.

మే 7వ తేదీన ఎన్నికల వేడి ముగిసి, చల్లారిన తరువాత విడుదల చేయడమే శ్రేయస్కరమని భావించి వాయిదాపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో సయామీ ఖేర్ కథానాయికగా నటించగా, శ్రద్దా దాస్ ప్రత్యేక పాత్ర పోషించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles