Sri divya will never put on a glamorous role

Actress Sri Divya, Sri Divya, Actress Sri Divya in hot Race,

Sri Divya will never put on a glamorous role

ఇక అలాంటి రోల్స్ నేను చేయలేను?

Posted: 04/27/2014 01:00 AM IST
Sri divya will never put on a glamorous role

'మనసారా', 'బస్ స్టాప్', 'మల్లెల తీరంలో సిరిమల్లె పూవు' వంటి సినిమాల ద్వారా కథానాయికగా మంచి అభినయాన్ని ప్రదర్శించింది. శ్రీదివ్య చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగమ్మాయిగా గుర్తింపు తెచ్చుకొని తెరపై  దూసుకుపోతుంది.

అయితే, ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. తమిళంలో ఒక్క సినిమా విడుదలతోనే ప్రస్తుతం ఆరు సినిమాలకు సంతకం చేసింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం నిర్మాణంలో వున్నాయి.

అభినయానికి ఆస్కారం వున్న పాత్రలకే ఈమెను ఎంచుకుంటున్నారు. 

తనకు కూడా అలాంటి పాత్రలే ఇష్టమని చెబుతోంది. "గ్లామర్ రోల్స్ కన్నా పెర్ఫార్మెన్స్ వున్నా రోల్స్ చేయడానికే ఇష్టపడతాను. ఇలాంటి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తాను" అంటోంది శ్రీదివ్య.  వచ్చిన కొత్త హీరోయిన్స్  అందరు అలాంటి రోల్స్ చేయనంటే.. ఇంక ఎవరు చేస్తారు.  సీనియర్ హీరోయిన్స్  చేత  ఆ పాత్రలు చేయిస్తే.. నిర్మాతలు.. దీవాలదీయటం ఖాయం అని అంటున్నారు. 

వెండితెరపైకి అడుగు పెట్టిన తరువాత మంచి, చెడు రెండు ఉంటాయి. అంతేగానీ  మీకు మీరే గీరి గీసుకొని కూర్చోంటే  చాలా కష్టమని సినీయర్ నటిమణులు అంటున్నారు.  శ్రీదివ్య అలాంటి  రోల్స్ చేయనంటే.. ఏదో జరిగి ఉంటుందని   కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి . 

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles