Jagapathi babu to play mahesh father

Jagapathi Babu to play Mahesh father role, Jagapathi Babu become a father to mahesh, Koratala Shiva-mahesh movie, Jagapathi babu father role,

Jagapathi Babu is soon going to be seen as Mahesh Babu father. This is for Mahesh Babu next film in Koratala Shiva’s direction.

బాలయ్య విలన్ తండ్రయ్యాడు

Posted: 04/21/2014 03:19 PM IST
Jagapathi babu to play mahesh father

టాలీవుడ్ హీరో జగపతి బాబు ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హీరోగా అవకాశాలు తగ్గడంతో ‘లెజెండ్ ’ సినిమాతో విలన్ గా కెరియర్ ని కొత్తగా ప్రారంభించిన జగపతి మొన్నటి వరకు విలన్ పాత్రలు మాత్రమే చేస్తానని, తండ్రి పాత్రలు అస్సలు చేయనని అన్నాడు.

కానీ ‘లెజెండ్ ’ లో విలనిజం ఇరగదీయటంతో పనికొట్టుకొని దర్శకులు ఆయన కోసం వివిధ పాత్రల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు - కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో జగపతి బాబు మహేశ్ తండ్రిగా కనిపించబోతున్నాడట.  ఈ విషయాన్ని.జగపతి బాబు స్వయంగా తెలుపుతూ... టాలీవుడ్ హార్ట్ త్రాబ్ మహేష్ తో వెండితెర పంచుకుంటున్నందుకు ఎగ్జయిట్ అవుతున్నాను ’ అంటూ జగపతి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.

ఇటీవల తాను పోషించిన పాత్రకు మంచి పేరు రావడంతో ఆ పేరును నిలబెట్టుకోవడానికే కాకుండా, మహేశ్ సినిమా ద్వారా తాను ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్దమనే సంకేతం జగపతి టాలీవుడ్ కి పంపాడని అంటున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పాత్రలే చేస్తాడా ? ఏదైనా చేయడానికి ఆసక్తి చూపుతారో చూడాలి.  ఇక మహేశ్ - కొరటాల శివ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాను మొదట యూటీవి మోషన్ పిక్చర్స్ నిర్మిస్తుందని అనుకున్నారు. కానీ వారు పెట్టే కండీషన్లకు ఎక్కడో కాలిన మహేష్ ఆ డీల్ క్యాన్సిల్ చేసి మైత్రి సంస్థకు ఈ సినిమా నిర్మించే బాధ్యతను అప్పగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles