టాలీవుఢ్ లో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు ’ మేడిన్ చెన్నయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కన్నడ భామ సంజన తెలుగు వారికి కూడా సుపరిచితమే. తెలుగులో అడపా దడపా సినిమాలు చేసిన ఈ అమ్మడు తాజాగా శాండల్ వుడ్ హీరో జగ్గేష్ తో కలిసి ‘అగ్రజ ’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కొన్ని మసాలా సీన్లు ఉన్నాయి. ఈ సన్నివేశాల పై పెద్ద వివాదమే స్రుష్టించింది సంజనా. ఈ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్రీకరించారని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని సంజన ఆరోపిస్తోంది.
వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్లో సంజన పేర్కొన్నారు. అయినా అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు దర్శకుడు ఎలా చెబితే అలా చేయాలని, ఒప్పందం ప్రకారమే ఆ సీన్లు చిత్రీకరించామని, ఇప్పుడు కావాలనే సంజన వివాదం స్రుష్టిస్తుందని సదరు నిర్మాత అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more