Ntr reliance 50 crore deal

NTR-Reliance 50 crore deal, NTR Remuneration, Reliance, Attarintiki Daredi, Devudu Chesina Manushulu, Bhai,

corporate production house Reliance is trying to make a deal with young tiger Jr.NTR by striking a 50-crore deal.

ఎన్టీఆర్ తో రియలన్స్ భారీ డీల్

Posted: 04/17/2014 01:13 PM IST
Ntr reliance 50 crore deal

టాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ ఒప్పందాలు చేసుకొని వారితో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఆయా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకొని వారి బ్యానర్లోనే వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి చేరబోతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన రియలన్స్ ఎంటర్ టైన్ మెంట్ మూడు సినిమాలకు గాను యాభై కోట్ల డీల్ కుదుర్చుకొందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రభస సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాను  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో తెలుగులో దేవుడు చేసిన మనుషులు, భాయ్, సాహసం, సినిమాలతో నష్టాలు చవి చూసిన ఆ సంస్థ అత్తారింటికి దారేదితో లాభాల భాట పట్టడంతో భారీ సినిమాలను నిర్మించే ప్లాన్ లో భాగంగానే ఎన్టీఆర్ తో ఈ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా మన తెలుగు బడా హీరోలు భారీ ప్యాకేజీలతో భలే లాభపడతున్నారని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles