Jagapathi babu villain again in ram movie

Jagapathi Babu as a Villain Again,Jagapathi Babu Villain Again, Jagapathi Huge Demand as Villain , Jagapathi Babu Villain Role

Jagapathi Babu as a Villain Again,Jagapathi Babu Villain Again, Jagapathi Huge Demand as Villain , Jagapathi Babu Villain Role

జగపతి బాబు విలన్ పాత్రలకే ఫిక్సయ్యాడు

Posted: 04/10/2014 01:23 PM IST
Jagapathi babu villain again in ram movie

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు జగపతి బాబుకి హీరోగా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తుండటంతో ఇటీవలే బాలయ్య – బోయపాటి కాంబినేషనల్లో వచ్చిన ‘లెజెండ్ ’ చిత్రం ద్వారా విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన విలన్ పాత్రలకే ఫిక్స్ అయ్యినట్లు ఉన్నాడు. ‘లెజెండ్ ’ సినిమాలో చేసిన పాత్రకు మంచి పేరు రావడంతో టాలీవుడ్ దర్శకులంతా విలన్ పాత్రలు ఇవ్వడానికి జగపతి బాబు దగ్గరికే క్యూ కడుతున్నారు.

ఇప్పటికే సాయిధరమ్ తేజ్  ‘పిల్లా నువ్వు లేని జీవితం ’, సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న ‘రారా కృష్ణయ్య ’ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈయనకు యంగ్ హీరో రామ్ నటిస్తుంన్న ‘పండగ చేస్కో ’ సినిమాలో విలన్ ఆఫర్ వరించినట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో జగపతిబాబు కూడా ఆ పాత్ర చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడట.

అదీ కాకుండా ప్రిన్స్ మహేశ్ బాబు - కొరటాల శివ సినిమాలో కూడా విలన్ పాత్రకు కమీట్ అయినట్లు తెలుస్తుంది. జగపతి బాబు వాలకం చూస్తుంటే ఇక పై విలన్ పాత్రలకే ఫిక్సయ్యినట్లు కనిపిస్తుంది. హీరోగా రాణించిన జగపతి విలన్ గా కూడా రాణించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles