Vijay amala paul to tie the knot soon

amala paul, saivam, al vijay, Vijay - Amala Paul, Vijay, Director Vijay,Amala Paul, Vijay-Amala Paul to tie the knot

Amala Paul and director Vijay are likely to marrying in June.

మూడుముళ్ళు వేయించుకోవడానికి సిద్దమౌతుంది

Posted: 04/08/2014 03:05 PM IST
Vijay amala paul to tie the knot soon

మళయాళ భామ అమలాపాల్ ఆపుకోలేక పోతుంది పెళ్ళి కోరికల్ని. అందుకే ఈ అమ్మడు త్వరలో పెళ్ళి పీఠలు ఎక్కడానికి సిద్దమౌతుందని అంటున్నారు మళయాళ జనాలు. గత కొంత కాలంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తో ప్రేమాయణం నడుపుతున్న ఈమె అతనితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని డిసైడ్ అయ్యిందని అంటున్నారు.

వీరి ప్రేమలో చిన్న చిన్న బిభేదాలు వచ్చి విడిపోయినా, ఇటీవలే మళ్ళీ ఒక్కటైన చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శక‌త్వం వ‌హించిన `నాన్న‌`లో అమ‌లాపాల్ కీల‌క పాత్ర పోషించింది. ఆ స‌మ‌యంలో ఇద్దరి మ‌ద్య ప్రేమ పుట్టింద‌ట‌. ఆ బంధం ముదిరిపోయింది. అయితే... మ‌ధ్యలో చిన్న చిన్న మ‌నస్పర్థల‌వ‌ల్ల విడిపోయార‌ని వార్తలొచ్చాయి. ఆ వార్తల‌కు త‌గ్గట్టుగానే ఇద్దరూ మ‌ధ్యలో ఎప్పుడూ క‌లుసుకోలేదు.

కొన్నాళ్లక్రితేమే రాజీ అయిన‌... ఈ జంట త్వర‌లోనే పెళ్లి పీట‌లెక్కాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తూ బిజీగా కొన‌సాగుతున్న అమలాపాల్... ఇక న‌ట‌న‌కు గుడ్ బై చెప్పి, జూన్ లో పెళ్లి చేసుకోవాల‌ని  నిర్ణయించుకొన్నట్టు  తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles