Rajamouli completes shooting war sequence

Anushka Shetty, Baahubali, Prabhas Varma, Rana Daggubati, SS Rajamouli, Telugu period-drama, war sequence

SS Rajamouli completes shooting war sequence for Anushka Shetty and Rana Daggubati Baahubali.

యుద్దం ముగిసిందంటున్న జక్కన్న

Posted: 04/08/2014 09:55 AM IST
Rajamouli completes shooting war sequence

దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ’ సినిమా షూటింగుకు సంబంధించిన యుద్ద సన్నివేశాలను గత కొంత కాలంగా హాలీవుడ్ రేంజ్ లో వివిధ ప్రదేశాలలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ యుద్ద సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపాడు. ఈ సినిమాలో అత్యధిక భాగం యుద్ద సన్నివేశాలు సంబంధించిన షెడ్యూల్ ని పూర్తి చేశామని, ఈ సన్నివేశాలను విజయవంతంగా పూర్తి చేయడంలో యూనిట్ సహాకారం మరవ లేనిదని, మాటల్లో చెప్పలేనిదని ఆయన అన్నారు.

చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పనిచేశారు. వారి సహకారం లేకపోతే ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు అని అన్నారు. విశాఖ పట్నంలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నామని.. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపారు. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 2015లో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles