Hero varun tej leg fractured in shoot

mega hero varun tej, varun tej injured, varun tej injured at gollabhama sets, varun tej gollabhama, varun tej sustained fracture, pooja hegde

Mega hero Varun Tej leg fractured in shoot at Allappey, Kerala.

మెగా హీరోకు షూటింగులో గాయాలు

Posted: 04/07/2014 02:44 PM IST
Hero varun tej leg fractured in shoot

మెగా కంపౌండ్ నుండి ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగులో హీరో వరుణ్ తేజ్ గాయాల పాలైనట్లు సమాచారం. కేరళలోని అలెప్పీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా వరుణ్ తేజ్ కాలు కొద్దిగా బెనికడంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు సమాచారం.

రెండు మూడు రోజుల్లో వరుణ్ తేజ్ కోలుకొని తిరిగి షూటింగులో పాల్గొంటాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ‘గొల్లభామ ’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హగ్దే హీరోయిన్ గా చేస్తుంది. వరుణ్ తేజ్ కి గాయం అయిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles