Dasari talks about a broker s role in state bifurcation

Election 2014, Dasari talks about a broker's role in state bifurcation, State bifurcation, Film director Dasari Narayana Rao

Dasari talks about a broker's role in state bifurcation

అందర్నీ సస్పెన్స్ లో ముంచెత్తిన దర్శకరత్న

Posted: 04/05/2014 11:14 AM IST
Dasari talks about a broker s role in state bifurcation

శుక్రవారం హైద్రాబాద్ లో కొన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్లు జరిగాయి.  అందులో ఒకదానిలో పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణ రావు తన వ్యాఖ్యలతో సస్పెన్స్ ని క్రియేట్ చేసారు.

అది బ్రోకర్-2 ఆడియో లాంచ్.  సరే అక్కడ, సినిమాను గురించి, దర్శకుడు హీరో హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడటం, సినిమా విజయవంతమవుతుందని కోరుకోవటం ఎలాగూ ఉంటుందనుకోండి,  దానితో పాటు ఆ కార్యక్రమంలో మాట్లాడిన దాసరి, సమాజంలో బ్రోకర్ ప్రాముఖ్యతను తెలియజేసారు.   ఒక చిన్న బడ్జెట్ మూవీ దగ్గర్నుంచి బోఫార్స్ వరకు ఒక బ్రోకర్ అవసరం ఎంతైనా ఉంటుందని అన్నారాయన.  రెండు పార్టలను కలపాలన్నా బ్రోకర్ అవసరం పడుతుంది.  పార్టీ టికెట్ కావాలన్నా బ్రోకర్ తో పనిపడుతుంది.  అలాగే రాష్ట్ర విభజనలోనూ ఒక బ్రోకర్ పనిచేసారని, వారి వివరాలను త్వరలేనే బహిర్గతం చేస్తానని అన్నారు దాసరి. 

దాసరి మాటలతో కలిగి సస్పన్స్ ఇంతా అంతా కాదు- పూర్తిగా ముంచెత్తేంత!  ఎవరా బ్రోకరు ఏమా కథ అని అయనెవరో తెలుసుకోవాలన్న ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది! 

అయితే, ఆ బ్రోకర్ ఎవరన్నది తనే త్వరలో తెలియజేస్తానని దాసరి హామీ ఇచ్చారు.  అయినా ఊరుకుంటారా మీడియాలో రకరకాల ఊహాగానాలు రౌండ్లు చేస్తున్నాయి. 

మన మెదడుకెందుకంత పదును పెట్టటం.  ఆ బ్రోకరెవరో తెలిసినప్పుడే తెలుస్తుంది.  అంతా అయిపోయిన తర్వాత విభజన బ్రోకర్ గురించి తెలుసుకుని చేసేది కూడా ఏమీ లేనప్పుడు ఆయన మీద ఊహాగానాలు కూడా ఎందుకు.  పైగా దాసరి చెప్పిన తర్వాత కూడా, ఒక వేళ నిజంగానే కొంతకాలం తర్వాత ఆ బ్రోకర్ పేరు చెప్పినా వాటికి ఆధారాలు కూడా ఉండకపోతే ఎంతవరకు నమ్మవచ్చో కూడా అర్థం కాదు కాబట్టి వేచి చూద్దాం దాని టైముకి అది ప్రసారమయ్యే టివి సీరియల్ కోసం ఎదురు చూసినట్లుగా. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles