Pawan friend raju raviteja life history

Pawan Kalyan, Power Star Pawan Kalyan, Pawan Kalyan Friend Raju Raviteja, pawan friend raju raviteja life history, Raju Raviteja, Director Trivikram, Jammikuntla Karimnagar district, Jana Sena party.

pawan friend raju raviteja life history, Raju Ravi Teja born and brought up in Jammikuntla Karimnagar district

పవన్ వెనుక ఉన్న ఫ్రెండ్ రాజురవితేజ లైప్ స్టోరీ ఇదే?

Posted: 03/18/2014 10:23 AM IST
Pawan friend raju raviteja life history

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వెనుక  దర్శకుడు త్రివిక్రమ్  ఉన్నరని  అందరు అనుకున్నారు.   మొన్న జరిగిన  జనసేన పార్టీ   ఆవిర్బావ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ తన వెనుక  దర్శకుడు త్రివిక్రమ్ లేరని చెప్పటం జరిగింది. కానీ   నా వెనుక క సంపన్నులు, రాజకీయ నేతలు లేరని అంటూనే.. తన ఫ్రెండ్ పేరును మెగా అభిమానులకు పరిచయం చేయటం జరిగింది.   

 పవన్ కళ్యాణ్  ఫ్రెండ్  కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిరాజు రవితేజ మాత్రమే ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పటి నుంచి ఆ రాజు రవితేజ ఎవరనే ఆసక్తి నెలకొంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి అనుబంధంగా ఉన్న యువజన విభాగమైన యువరాజ్యంకు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు అయితే, రాజు రవితేజ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచి రవితేజ తెరవెనుక కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

నిజానికి రాజు రవితేజ తన ఉపన్యాసాలు, సలహాలతో, పుస్తకాలతో ప్రభావితం చేసిన వ్యక్తిగా తెలుస్తోంది. రవితేజ ఇప్పటికే ఆయన పలు దేశాల్లో ప్రసంగాలు చేశారు. ఒక పేద కుటుంబానికి చెందిన రవితేజ 16 యేళ్ల వయస్సులో ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆఫీస్ బాయ్ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఎదిగారు. 22 ఏళ్ల వయసులో యూరిస్కో కన్సల్టింగ్‌ను ప్రారంభించక ముందు కార్పోరేట్ యాడ్స్ రంగంలో కన్సల్టెంట్‌గా ఉన్నారు.

భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల్లోనూ, యూరప్‌లోనూ 100కు పైగా సంస్థలు సలహాదారునిగా ఆయన సేవలను వినియోగించుకున్నాయి. దేశంలోని 65 విద్యా సంస్థలతో ఆయన కలిసి పనిచేశారు. పిల్లల కోసం, యువత కోసం పుస్తకాలు రాస్తున్నారు. ఫిలాసఫీ గురించి రాస్తున్నారు.

ఇప్పటివరకూ ఆయన నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. 1994లో 'యూరిస్కో కన్సల్టింగ్' అనే సంస్థనూ, 2002లో 'ఇన్‌స్పైర్ ఇండియా' అనే లాభాపేక్ష లేని ట్రస్టును ప్రారంభించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తో  రాజురవితేజ  సంబంధం ఏర్పాడినట్లు తెలుస్తోంది. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles