Srinu vaitla remuneration 11 crores for aagadu

srinu vaitla remuneration, 11 crores for Aagadu, srinu vaitla aagadu,Srinu Vaitla,Mahesh babu aagadu,Mahesh Babu,aagadu

Srinu Vytla is being paid a package deal of whopping Rs. 11 Crore for script and direction of Aagadu.

శీను వైట్ల రెమ్యునరేషన్ స్టార్ హీరో అంత

Posted: 03/10/2014 05:49 PM IST
Srinu vaitla remuneration 11 crores for aagadu

టాలీవుడ్ లో సినిమాల బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నా, దానిని దర్శకులు కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. ఒక హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ, కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మంచి ఊపులో ఉన్న దర్శకుడు శీను వైట్ల కూడా భారీగా పారితోషికం తీసుకుంటున్నాడు.

గతంలో మహేష్ బాబుతో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై ‘దూకుడు ’ సినిమా తీసిన శీను వైట్ల ఇప్పుడు అదే బ్యానర్ పై మహేష్ బాబుతో  ‘ఆగడు ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం శీను వైట్ల ఏకంగా 11 కోట్లు వసూలు చేస్తున్నాడని సమాచారం.

గతంలో ఇతని దగ్గర పనిచేసిన సీనియర్ రచయితలకు భారీగా డబ్బులిచ్చుకున్నాడు ఇప్పుడు వారిద్దరు బయటకి వెళ్లి పోవడం, ఇద్దరు కొత్తవారు రావడంతో వారికి అంతంత మాత్రంగానే చెల్లించి, మిగతావన్నీ తన జేబులోనే వేసుకుంటున్నాడట. ఈ లెక్కన చూస్తే స్టార్ హీరో బన్నీ లాంటి స్థాయి వారితో సమానంగా పారితోషికం తీసుకుంటున్నాడని, దర్శకులే ఇంత తీసుకుంటే ఇక మిగతావారి సంగతేంటని అడుగుతున్నారు కింది స్థాయి వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles