Allu arjun sneha complete three years

allu arjun marriage day, Allu Arjun, Stylish Star Allu Arjun, Sneha Reddy, Allu Arjun Sneha, Allu Arjun Sneha marriage, Allu Arvind, Chiranjeevi, Allu Arjun Sneha wedding, Hitex, Race Gurram, Race Gurram audio release

Allu Arjun & Sneha complete three years, allu arjun marriage day

అల్లు అర్జున్-స్నేహాల పెళ్లి రోజు శుభాకాంక్షలు

Posted: 03/06/2014 03:58 PM IST
Allu arjun sneha complete three years

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మార్చి 6, 2011న అంగరంగవైభవంగా తన స్నేహితురాలు  స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజు.  ఇరువైపుల పెద్దల అంగీకరంతోనే పెళ్లి జరిగింది.  కానీ బన్నీ తన భార్యతో కలిసి పెళ్లి రోజును గతంలో చేసుకోలేకపోయాడు.  ఆ సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో ’ షూటింగ్ నిమిత్తం స్పెయిన్లో ఉండటంతో ..అక్కడే  బన్నీ తన ‘‘మ్యారేజ్ డే’’ ని జరుపుకున్నాడు.  

అయితే  బన్నీకి మ్యారేజ్ అయిన తరువాత ‘‘ఇద్దరమ్మాయిలతో’’ ‘‘జులాయి’లాంటి హిట్ సినిమాలను  ప్రేక్షకుల అందించాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.  రీసెంట్ గా ‘‘ఎవడు’’ సినిమాలో  అల్లు అర్జున్  నటించిన విషయం తెలిసిందే.   ప్రస్తుతం  బన్నీ ‘‘రేసు గుర్రం’’సినిమా షూటింగ్ పూర్తి చేసుకోని, విడుదలకు సిద్దంగా ఉంది. 

అల్లు అర్జున్ స్నేహాల పెళ్లి జరిగి నేటికి  మూడు వసంతాలు అయ్యింది.  ఈ టాలీవుడ్ ప్రేమ జంట గడిచిన మూడు వసంతాలు ..ఎంతో హాయిగా జీవితాన్ని గడిపారు. సహజంగా ప్రేమ పెళ్లి అంటే  చాలా పెద్దలు పెదవిరుస్తారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ తల్లిదండ్రులు, స్నేహా తల్లిదండ్రులు  చాలా పెద్ద మనసుతో వీరి పెళ్లి చేసి, చరిత్రలో గొప్ప తల్లిదండులుగా పేరు తెచ్చుకున్నారు.  


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/allarjunsnehamarriageday

అల్లు అర్జున్, స్నేహాల  సంసార జీవితంలో  ఎలాంటి  సంఘర్షణలు లేకుండా హాయిగా ఒకరికోకరు ప్రేమను పంచుకుంటూ,  జీవిత ప్రయాణం సాగిస్తూ,  తల్లిదండ్రులకు మంచి  పేరు తెచ్చిపెట్టారు. 

ఇప్పుడు అల్లు  అర్జున్  స్నేహల జంటను చూసి ప్రేమ పెళ్లి చేసుకున్నవారు ఆదర్శంగా తీసుకోవాలని  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. 

టాలీవుడ్ లో అనురాగానికి, అప్యాయతకు, మమకారానికి పెట్టింది పేరు అల్లు అరవింద్ గారి ఇల్లు.  అత్త నిర్మాల అనురాగం, మామ అల్లు అరవింద్  మమకారాల మద్య కోడలు స్నేహ అందరితో కలిసిపోయి, టాలీవుడ్ లో  మంచి పేరు  తెచ్చుకుంది.  

అల్లు అర్జున్ క్రమశిక్షణ కలిగిన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినాడు కాబట్టి,  తన కుటుంబం పట్ల  చాలా గౌరవం కలిగి నడుకోవటమే, బన్నీకి అభిమానుల సంఖ్యను  రోజు రోజుకి పెంచుతుంది.  ఇలాగే బన్నీ కుటుంబం నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని, బన్నీ నటించే సినిమాలు విజయం సాధించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. 

ఈరోజు  అల్లు అర్జున్ స్నేహల  పెళ్లి రోజు  సందర్భంగా తెలుగు విశేష్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles