Pawan kalyan voice over for varun tej movie

pawan kalyan, pawan, pawan kalyan voice over, varun tej movie, pawan kalyan voice over for varun tej movie, Son of Nagababu, mega fans.

pawan kalyan voice over for varun tej movie

మాటిచ్చిన పవన్ కళ్యాణ్ - పొంగిపోతున్న మెగా ఫ్యాన్స్

Posted: 03/01/2014 05:39 PM IST
Pawan kalyan voice over for varun tej movie

పవన్ కళ్యాణ్ మాట ఇస్తే వెనక్కి తీసుకునే రకం కాదని అందరికి తెలుసు. టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడాలని కోరుకునే వ్యక్తి ఒక పవన్ కళ్యాణే అని విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.  నిజాయితీగా, నిర్భయంగా  తన మనసులోని మాటను బయటపెట్టే ఏకైక టాలీవుడ్ మగాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే.  ప్రచారం కోసమో, పరపతి కోసమో పవన్ కళ్యాణ్ ప్రయోగాలు చేయలేదు. 

 ‘‘కన్నీళ్లకు , కష్టాలకు చాలా దగ్గర వ్యక్తి ’’ .  పరిస్థితులను అర్థం చేసుకోని  అందరికి అనురాగం పంచగల  పవర్  పవన్ కళ్యాణ్ లో పుష్కాలంగా ఉందని ఇప్పటికే  చాలా మంది గుర్తించారు.  పని ఏదైనా (పదిమందికి ఉపయోగపడేది)  పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభిస్తే.. అది సక్సెస్ అవుతుందని  టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరికి తెలుసు.  అందుకే  ఆయన అభిమానులు , ప్రేమికులు, శ్రేయోభిలాషులు పవన్ పేరు  ఉపయోగించుకుంటుంటారు. 

ఇప్పుడు  మెగా అన్నయ్య నాగబాబు  తనయుడు వరుణ్ తేజ్ కి పవన్ కళ్యాణ్  వాయిస్ ఇస్తున్నట్లు సమాచారం.  పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన వాయిస్  ఓవర్ ఇవ్వలేదు.   మెగా అన్నయ్య తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు  టాలీవుడ్ సమాచరం.  

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఇటీవ‌లే ఓ చిత్రం కొబ్బరికాయ్ కొట్టిన విషయం తెలిసిందే. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రియేటీవ్ స‌ల‌హాలన్నీ ప‌వ‌న్ అందిస్తున్నాడనే టాక్ టాలీవులో వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ ఇస్తాన‌ని కూడా ఒప్పుకోవటం జరిగిందని పవన్ అభిమానులు అంటున్నారు. 

దీంతో వ‌రుణ్ తొలి సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వ‌చ్చిచేరింది. ప‌వ‌న్ వాయిస్ ఓవ‌ర్ అందించిన తొలి సినిమాగా ఈ చిత్రం రికార్డుల్లో నిల‌చిపోనుంది. మెగా అభిమానులు  పవన్ వాయిస్ ఓవర్ విషయం తెలిసిన నాటి నుండి ఆనందంతో పొంగిపోతున్నారు. 

ఏమైన కొత్తవారికి లైప్ ఇవ్వటంలో పవన్ కళ్యాణ్ తరువాతనే ఎవరైన అనే మాటలు  టాలీవుడ్ సందడి సందడిగా వినిపిస్తున్నాయి. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles