Chiru pawan to attend varun tej debut film launch

Chiranjeevi, Pawan, film launch, Megastar Chiranjeevi, Power satr, Pawan Kalyan, Telugu debut, film's director, Srikanth Addala, Pawan brother Nagababu, Tagore Madhu, Nallamalapu Bujji, Leo Entertainments, varun tej, chiranjeevi, pawan kalyan, ram charan, allu Arjun, Mega Brother, Nagababu son, varun tej debut, movie launch, varun tej debut movie's launch, Mega Family, Mega Heroes, Mega fans, Pawan fans, Cherry, Bunny.

Megastar Chiranjeevi and actor Pawan Kalyan will attend the formal launch of their nephew Varun Tej.

చాన్నాళ్ళ తరువాత అన్న దమ్ములు ఒకే వేదిక పై

Posted: 02/26/2014 05:09 PM IST
Chiru pawan to attend varun tej debut film launch

రేపు మెగా అభిమానులకు పండగే. మెగా వంశం వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు  నుంచి మరో వారసుడి తెరంగ్రేటంకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ సందడి చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు.

ఈ సినిమా షూటింగ్ రేపు రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమ వేడుకలో ఒకే వేదిక పై మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించబోతుండటంతో చాలా రోజుల తరువాత ఇలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకోబోతుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా రోజుల నుండి వీరిద్దరి మధ్య దూరం ఏర్పడిందని, అందుకే ఒకరు వచ్చే కార్యక్రమానికి ఒకరు హాజరు కాని ఫంక్షన్లు కూడా ఉన్నాయి.

మరి ఇప్పుడు ఇద్దరు వస్తే వీరి మధ్య విబేదాలు లేవనే అనుకోవాలి. ఇన్ని రోజుల వచ్చిన వార్తల పై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని మాటీవి  ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది.  ఒక సినిమా ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ సినిమాను లియో ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles