Prabhas eats 40 eggs daily for fitness

Prabhas eating 40 eggs, prabhas weight 102 kgs, Baahubali shooting, 20 kg weight gained,

Young Rebel Star Prabhas who weighed 82 kgs has gained the weight of 150 kgs by eating too many fat items.

కుంభాలు కుంభాలు లాగించేస్తున్నాడు

Posted: 02/24/2014 01:22 PM IST
Prabhas eats 40 eggs daily for fitness

టాలీవుడ్ బాహుబలుడు ప్రభాస్ ఇప్పుడు కుంభాలు కుంభాలు లాగించేస్తున్నాడట. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘బాహుబలి ’ సినిమా కోసం జక్కన్న బరువు పెరగమని చెప్పడమే దీనికి కారణమట. ఆ సినిమాలో భారీ ఖాయంతో కనిపించడానికి ఇతగాడు రోజుకు 40 గుడ్లు, పాలు వంటివి కాకుండా ప్రొటీన్స్ విటమిన్స్ ఉన్న పదార్థాలను తీసుకుంటున్నాడట.

ఆరునెలల క్రితం 82 కిలోలున్న ఈ హీరో గారి బరువు ఇప్పుడు 102 కిలోలకు వచ్చిందట అంటే మనోడు రోజుకు ఎంత తింటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇలా లావు కావడానికి ఏం ఏం తినాలి అని తెలుసుకోవడానికి యూఎస్ వెళ్లి రెజ్లింగ్ ట్రైనింగ్ తీసుకుని, వాళ్ల ఆహార నియమాలు తెలుసుకుని వచ్చి వాటిని ఫాలో అవుతున్నాడట.

ఇంట్లోనే ఆధునాతన జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు. వారు చెప్పినట్లు తింటూ, వ్యాయామాలు మాత్రమే చేస్తూ ఉంటే ఈ మాత్రం బలవడం పెద్ద విషయంమేమి కాదంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles