High demand for legend movie satellite rights

Legend movie satellite rights in great demand, Legend movie satellite rights, Legend movie, Legend Satellite Rights Legend Movie Satellite Rights Balakrishna Legend Satellite Rights Balakrishna Legend Movie Satellite Rights, satellite rights in great demand

High demand for Legend movie satellite rights. Legend movie satellite rights in great demand, Legend movie satellite rights,

లెజెండ్ శాటిలైట్స్ రైట్స్ కి భారీ డిమాండ్

Posted: 02/22/2014 05:37 PM IST
High demand for legend movie satellite rights

‘సింహా ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శీనుతో బాలయ్య చేస్తున్న చిత్రం  ‘లెజెండ్ ’. వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన తరువాత బాలయ్య చేసిన చిత్రాలు ఏమీ హిట్టు రాకపోవడంతో మళ్లీ అతనితో చేయడానికే మొగ్గు చూపాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కుల కోసం భారీగా పోటీ ఏర్పడటంతో దర్శక నిర్మాతలు కూడా భారీగానే రేటు చెబుతున్నారట.

బోయపాటి-బాలయ్య క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం కావడంతో జెమినీ టీవి, మా టీవీ వారు పోటీ పడుతుండటంతో నిర్మాతలు ఎనమిదిన్నర కోట్ల వరకు చెబుతుంటే వారు కోటి తగ్గించి అడుగుతుండటంతో ఈ సినిమా రైట్స్ ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ డైలాగులే కాకుండా, బాలయ్యను యంగ్ అండ్ డైనమిక్ గా చూపిస్తున్నాడు బోయపాటి శీను. మరి ఇంత డిమాండ్ ఉన్న ఈ సినిమా రైట్స్ ఏ టీవీ వారు దక్కించుకుంటారో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles