Pawan gives nod for sampath nandi not gabbar singh 2

Pawan Kalyan gabbar singh,Pawan Kalyan,Oh My God,gabbar singh 2,Gabbar Singh

Gabbar Singh 2 is going to be formally launched tomorrow.

గబ్బర్ సింగ్ -2 కాదట.. కొత్త స్టోరీతో

Posted: 02/20/2014 09:02 PM IST
Pawan gives nod for sampath nandi not gabbar singh 2

ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న వస్తున్న గబ్బర్ సింగ్ 2 చిత్రానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ చిత్రానికి రేపు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతుందని ప్రచారం జరిగిన ఈ సినిమా స్టోరీ ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ చేశారని, సంపత్ నంది, ఇంకొంత మంది రచయితలు కలిసి తయారు చేసిన స్టోరీ పవన్ కళ్యాణ్ కి అంతగా నచ్చక పోవడంతో మొత్తమే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలని అనుకున్నారు.

కానీ సంపత్ నంది దగ్గర ఉన్న మరో కథ పవన్ కి నచ్చడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని, కంప్లీట్ కొత్త కథతో తెరకెక్కబోయే ఈ సినిమా పవన్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు మాస్, ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని, సంపత్ నంది ఈ సినిమాను తనదైన స్టైల్లో తెరకెక్కించబోతున్నాడని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి జరగబోతుంది.

ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఓ మై గాడ్‌ రీమేక్‌లో నటించడానికి అంగీకరించిన పవన్‌కళ్యాణ్‌ ఒకేసారి రెండు సినిమాల్లో చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles