Pawan clarifies about his third marriage

Pawan Kalyan, Anna Lezenva, Tollywood, pawan kalyan third marriage, pawan kalyan speaks about his 3rd marraige, Pawan Kalyan about his m3rd marrriage, India today, Pawan Kalayan,Pawan Kalyan third Marriage,India Today Magazine,Tollywood,

Pawan said, that it is called personal for a reason, and he would like to keep it a personal issue and would not like to talk about it.

పవన్ మూడో పెళ్ళి పై క్లారిటీ

Posted: 02/20/2014 10:45 AM IST
Pawan clarifies about his third marriage

టాలీవుడ్ లో గత కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ రహస్యంగా రష్యన్ మోడల్ డానా మార్క్ ను గత ఏడాది సెప్టెంబర్ లో మూడో పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికి ఓ పాప కూడా పుట్టిందని మీడియా కోడైకూయడమే కాకుండా, దానికి సంబంధించిన ఆధారాలు ఇవేనంటూ కూడా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించారు.

ఇన్ని పుకార్లు వచ్చినా పవన్ ఆ పెళ్లి గురించి ఇంత వరకు నోరు విప్పలేదు. కానీ ప్రముఖ మేగజైన్ అయిన ‘ఇండియా టుడే ’ పవన్ పై ప్రచురించే ఎడిషన్ లో అన్ని విషయాల పై స్పష్టత ఇస్తాడని అంతా ఎదురు చూశారు. ఆ పత్రిక జరిపిన ఇంటర్య్వూలో పవన్ పెళ్లి గురించి ప్రస్తావించగా... అది వ్యక్తిగత విషయం అని, తన వైవాహిక జీవిత విషయాలు ఇలా బయటివాళ్లతో పంచుకోలేనని,  వ్యక్తిగత విషయాలు కాబట్టి దానిని అలాగే ఉంచేద్దాం ’’ అని   చెప్పాడు. 

పవన్ ఇన్ని రోజులు ఏదో చెబుతాడు అని ఎదురు చూసిన వారికి, పెళ్లి విషయాన్ని జోరుగా ప్రచారం చేసిన మీడియాకి కాస్తంత నిరాశే మిగిలింది. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పే పవన్ ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుంటే చెప్పేవాడే కదా ? పెళ్ళి విషయంలో మీడియా ప్రదర్శించిన తీరు చూస్తుంటే కాస్తంత అత్యుత్సాహం చూపించిందేమో అనిపిస్తుంది కదూ ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles