Pawan next film title jana gana mana

Pawan Kalyan movie Jana Gana Mana, Pawan Kalyan in Jana Gana Mana, Pawan Kalyan dil raju new movie, Jana Gana Mana movie, Pawan Kalyan new movie title, Pawan Kalyan movie with Dil Raju, pawan with krishna vamsi, Pawan Kalyan new project Jana Gana Mana, Pawan Kalyan new movie Jana Gana Mana

Pawan kalyan next film will be titled as Jana Gana Mana. As per our latest sources Pawan kalyan will be seen in Dil raju’s production for his next film in 2015.

పవన్ కళ్యాన్ చిత్రం ‘జనగణమణ’

Posted: 02/12/2014 03:31 PM IST
Pawan next film title jana gana mana

దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు తెచ్చుకొని ఎంతో మంది బడా హీరోలతో సినిమాలు చేసినా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేదు. తాను ఎప్పటికైనా పవన్ తో సినిమా చేస్తానని, చేసే అవకాశం వస్తే వదులుకోనని చెప్పాడు.

ఇటీవలే మెగా కంపౌండ్ నిర్మాతగా పేరుతెచ్చుకొని అల్లు అర్జున్, చరణ్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు తన తరువాతి సినిమాను పవన్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. పవన్ కోసం దిల్ రాజు ఫిలిం ఛాంబర్ లో ‘జనగణమణ ’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేయించాడట. ప్రస్తుతం ఇద్దరు వరుస విజయాలతో మంచి సక్సెస్ లో దూసుకుపోతున్నారు.

ఎన్ని కమర్షియల్ హిట్లు వచ్చినా పవన్ కి ఎప్పటి నుండో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని, అది కూడా తన ఆలోచనలకు దగ్గరగా ఉండాలని భావిస్తున్నాడట. అందుకు అనుగుణంగానే దిల్ రాజు దర్శకుడిని వెతితే పనిలో పడ్డాడట. మరి అలాంటి సినిమాలు చేసే దర్శకుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నది క్రిష్ణవంశీనే.

ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తే దిల్ రాజు అతనికి ఈ ప్రాజెక్ట్ అప్పగించాలని చూస్తున్నాడట. ఏది ఏమైనా పవన్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గురించి ఆలోచిస్తున్నాడంటే తాను రాజకీయ అరంగ్రేటం చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని అనుకోవచ్చా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles