Deepika padukone demands rs 1 crore per day

Deepika Padukone rate Rs 1 Crore, Deepika Padukone demands 1 crore, Bollywood actress Deepika, deepika in Vijay movie

Bollywood Actress Deepika Padukone has reportedly stunned Chimbu Devan and Vijay as she asked Rs. 1 crore to act in their upcoming flick.

దీపికా కావాలంటే... రోజుకు కోటి ఇచ్చుకోవాల్సిందే

Posted: 02/06/2014 10:25 AM IST
Deepika padukone demands rs 1 crore per day

బాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న దీపికా పదుకునే కావాలనుకుంటే అక్షరాల కోటి చేతులో పట్టుకోవాల్సిందే. ఈ అమ్మడు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు కాల్షీట్లు ఇస్తానంటుది కానీ రోజుకు కోటి సమర్పించుకోవాల్సిందే అంటుంది. తమిళ హీరో విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో దీపికా పదుకునేను నిర్మాత సంప్రదించాడు. అన్నీ విన్న తరువాత విజయ్ తో నటించడానికి నాకేమి అభ్యంతరం లేదు కానీ రోజుకో కోటి ఇచ్చుకోండి అని నిర్మొహమాటంగా చెప్పే సరికి నిర్మాత గుండె గుభేల్ మందట. రోజుకు కోటి చొప్పున లెక్కేస్తే దీపికా పదుకునే పారితోషికం హీరో విజయ్ పారితోషికాన్ని మించుతుందట. దీంతో పారితోషికం తగ్గించే విషయమై ఆమెతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నారని సమాచారం.

తమిళ భామలు అయితే ఇళయదళపతిగా పేరుతెచ్చుకున్న విజయ్ తో నటించమని అడిగితే ఫ్రీగా చేసేవారున్నారు. అలాంటిది వారందర్ని కాదని బాలీవుడ్ భామను తీసుకుంటే ఇలానే ఉంటుందని అంటున్నారు తమిళ జనాలు. అయినా రోజుకు కోటి చొప్పున ఇచ్చుకోవడం అంటే ఎవరికైనా కష్టమే.  ఇక జిల్లా తరువాత విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవ ల ప్రారంభమైంది .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles