South superstars get together party in chennai

Chiranjeevi,Rajinikanth, Venkatesh, Bala Krishna, Khushboo, Shobana, Suhasini, Mohanlal, saritha, Naresh, Radha, Nadiya, Ambrish, Radhika, Suman, Revathi, Arvind, Bhanuchander, Arjun, Sumalatha, South Indian Superstars' get-together party, South Indian Superstars Get Together Party Photos, South Indian Superstars Get Together Party Pics, South Indian Superstars Get Together Party Slideshow.

South Indian Superstars get-together party. Malayalam star Mohanlalfarmhouse in Chennai yesterday.

సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ అరుదైన కలయిక

Posted: 01/21/2014 11:34 AM IST
South superstars get together party in chennai

South indian stars

పై ఫోటోలో కనిపిస్తున్న వీరంతా రంగురంగుల చొక్కాలు వేసుకొని అదిరే స్టిల్స్ ఇచ్చిన వీరందరు ఎవరో గుర్తు పట్టారా ? 80వ దశకంలో సౌత్ సినిమా ఇండస్ట్రీని తనదైన శైలిలో ఏలిన సూపర్ స్టార్ హీరో, హీరోయిన్లు. వీరంతా ఇటీవల మళయాళం నటుడు మోహన్ లాల్ , సుహాసిని కలిసి ఏర్పాటు చేసిన పార్టీలో ఇలా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

South india actress

80వ దశకం నుండి నేటి వరకు కూడా వెండితెర పై ప్రేక్షకుల్ని ఏదో విధంగా అలరిస్తున్న వీరు సినిమాలతో, ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్న వీరు ఇలా కలిసి అలనాటి తీపిగుర్తుల్ని గుర్తుచేసుకున్నారు. వందేళ్ళ సినిమా చరిత్రలో ఇలాంటి అపురూప కలయిక ఇదే అనడంలో సందేహం లేదు. స్నేహానికి ప్రతిరూపంగా ఏర్పాటుచేసిన ఈ పార్టీకి  మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్, మోహన్‌లాల్, అంబరీష్, వెకంటేష్, బాలక్రిష్ణ, సుమన్, అరవింద్ రమేష్, అంబరీష్ , భాను చందర్, అర్జున్, జయరామ్, నరేష్, నటీమణులు సుహాసిని, రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, సుమలత, నదియా, రేవతి, మేనక, జయశ్రీ, పూర్ణిమాభాగ్యరాజ్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

south india heros

రజినీకాంత్, చిరంజీవి మధ్యలో కూర్చోగా, మిగిలిన నటులు వారి చెంతన చేరి ఇలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో కలుసుకోవాలనీ, ఈ సారి కమలహాసన్, నాగార్జున కూడా హాజరు కావాలని తారలంతా తీర్మానించారు. ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సుహాసిని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles