Ram charan titled as govindudu andarivadele

Ram Charan, Govindudu Andarivadele, Krishnavamsi, Mega Power star RamCharan, Ram Charan upcoming film title

Mega Power star RamCharan next film with Krishnavamsi. The film is expected to be titled as Govindudu Andarivadele which is the tag line of NTR super hit

చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే ?

Posted: 01/21/2014 09:49 AM IST
Ram charan titled as govindudu andarivadele

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు ’ సినిమా సూపర్ హిట్టయిన ఆనందంలో ఉండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న చెర్రీ తన తదుపరి సినిమా క్రిష్ణ వంశీ దర్శకత్వంలో చేయడానికి సిద్దం అవుతున్నాడు. జనవరి 26వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్దం అవుతున్న ఈ సినిమాకు టైటిల్ గా ‘గోవిందుడు అందరి వాడేలే ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా సినిమా వర్గాల సమాచారం.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బ్రుందావనం ’ సినిమా ట్యాగ్ లైన్ నుండి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో ఉమ్మడి కుటుంబాల మాధుర్యాన్ని తెలియజేసే ఈ కథకు టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో బండ్ల గణేష్ నిర్మిస్తుండగా, యస్. యస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, చెర్రీ సరసన కాజల్ నటిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా షెడ్యూల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles