Mollywood offers to premakathachitram nandita

prema kathachitram, nandita, maaliwood, sumant aswin, ms raju, neeku naku dash dash, nandita go to Mollywood, landon bridge, prudhvi raj

Mollywood offers to premakathachitram nandita

మాలీవుడ్ చెక్కేస్తున్న ప్రేమకథాచిత్రం పాప

Posted: 01/17/2014 10:07 AM IST
Mollywood offers to premakathachitram nandita

చారడేసి కళ్లతో అభిమానులను ఇట్టే ఆకట్టుకున్న నందిత తేజ రూపొందించిన  నీకు నాకు డాష్ డాష్ సినిమాతో పరిచయమైది.. మొదటి చిత్రంతోనే  తన అందాలను చూపి ప్రేక్షకులను ఇట్టే బుట్టలో పడేసింది. దీంతో ఈ అమ్మడుకి సినీ అవకాశాలు  విపరీతంగా వచ్చాయి.

ఈమె నటించిన మొదటి సినిమా అంతగా విజయం సాధించకపోయినా  మారుతి పర్యవేక్షణలో  నిర్మితమైన  సినిమాలో ప్రేమకథాచిత్రమ్ లో తన నటనకు పెద్ద మెత్తంలో మార్కులు వేయించుకుంది. తరువాత ఎం.ఎస్  రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నిర్మితమవుతున్న లవర్స్ సినామాకు కమిట్ అయ్యంది. ఇంతలోనే నందితకు మాలీవుడ్ అవకాశం రావడంతో వెంటనే ఓకే చేసేసింది.

లండన్ బ్రిడ్జి అనే సినిమాలో ప్రుధ్వి రాజ్ హీరో.  కాగా అనిల్ సి మీనన్ దర్శకత్వంలో   ఈ సినిమా రూపొందనుంది.  ఈ సినామాలో  మరో హీరోయిన్ గా ఆండ్రియా కూడా నటిస్తోంది.  ఇప్పటికే తెలుగులో మార్కెట్ దక్కించున్న  ఈ ముద్దుగుమ్మ  ఇకపై మాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచుతానంటోంది.. అటు తెలగు, ఇటు ఇతర భాషలలో అవకాశాలు దక్కించుకోవాలని నందిత ఎంతో ఉబలాట పడుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles