Pawan to attend rey audio launch today

Rey audio release today, Rey movie audio launch in Shilpa Kala Vedika, Audio release function of Rey movie, Audio launch of Rey, Pawan Kalyan chief guest for Rey audio launch

Rey audio release today, Rey movie audio launch in Shilpa Kala Vedika, Audio release function of Rey movie, Audio launch of Rey, Pawan Kalyan chief guest for Rey audio launch

ఎట్టకేలకు ఇవాళ వస్తున్న పవన్

Posted: 01/17/2014 10:07 AM IST
Pawan to attend rey audio launch today

మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రేయ్ సినిమా ఆడియో నేడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల కాబోతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ‘రేయ్ ’ సినిమా శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారు. గత కొన్ని రోజుల క్రితమే విడుదల కావాల్సిన ఈ ఆడియో పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా రాకపోవడంతో వాయిదా వేశారు. కానీ నేడు పవన్ తప్పకుండా వస్తుండటంతో దర్శక నిర్మాత అయిన వైవీఎస్ చౌదరి భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు.

మొదటి నుండి ఈ సినిమా ఆడియోకు మెగా హీరోను పిలిచి సినిమాకు హైప్ తేవాలని చూస్తున్న చౌదరి తను అనుకున్నది సాధించాడని అంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రీ అందించిన స్వరాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగా హీరో ధరమ్ తేజ్ డెబ్యూట్ మూవీగా వస్తున్న ఈ సినిమా లో సయామీఖర్ శారదా దాస్ నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles