I am in love with nithin says puri jagannadh

heart attack movie, heartattack movie, heart attack trailer, heart attack movie first look, heart attack movie theatrical trailer, nitin heart attack, Puri Jagannadh at Heart Attack Press meet,

I am in love with Nithin says Puri Jagannadh.

నితిన్ ప్రేమలో పడిన పూరి జగన్నాథ్

Posted: 01/09/2014 08:56 PM IST
I am in love with nithin says puri jagannadh

ఎప్పుడు తన సినిమాలో కొత్త కొత్త ఐటెం భామలను వెండితెరకు పరిచయం చేస్తూ, వారితో చాటు మాటు వ్యహారాలు నడిపే దర్శకుడిగా పేరున్న పూరీ జగన్నాథ్ లవ్ లో పడ్డాడు. అది అమ్మాయితో కాదు. అబ్బాయితో... అదేంటి ఈయన ఏమన్న తేడానా ? అనే సందేహాన్ని రానీయకండి. ఆయన ప్రేమ మరోటైపు అన్నమాట. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హీరో నితిన్ తో ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఆడియోను ఇవాళ సాదా సీదాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... ఈ సినిమా ముందు వరకు నితిన్ అంటే వక్యిగతంగా మాత్రమే ఇష్టపడే వాడిని కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి అతన్ని వ్యక్తిగతంగా ప్రేమించడం మొదలు పెట్టాను. అంతగా తను మనవాడైపోతాడు. అసలు అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.అది ఇప్పటికి వర్కౌట్ అయింది... ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా పై పూరీ కూడా గంపెడాశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను ఈనెల చివర్లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles