Sukumar confirms movie with jr ntr

sukumar, ntr movie, young star, ntr movie titled as young star, Sukumar confirms movie with Jr Ntr, jr ntr sukumar movie details, sukumar jr ntr movie confirmed

Sukumar who is awaiting for the release of his film 1 Nenokkadine with Mahesh Babu in the lead has confirmed his next film with Young Tiger.

సుక్కు తరువాత సినిమా ప్రకటించాడు

Posted: 01/09/2014 08:51 PM IST
Sukumar confirms movie with jr ntr

టాలీవుడ్ లో ఢిఫరెంట్ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చున్న సుకుమార్ ప్రస్తుతం దర్శకత్వం వహించిన ‘1’ నేనొక్కడినే సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హాలీవుడ్ స్థాయి లో తెలుగు ప్రేక్షకులకు ఢిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్న ఈ చిత్రం తరువాత సుకుమార్ చిత్రం ఎవరితో ఉంటుందనే సందేహం ఉండేది. కానీ నేడు ఆ సందేహాన్ని నివ్రుత్తి చేస్తూ తన తరువాతి ప్రాజెక్టు ప్రకటించాడు. ఆ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ తో సుక్కు సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తారని ఫిలిం వర్గాల నుండి వార్తలు వినిపించాయి.

ఆ వార్తలే ఇప్పుడు నిజమయ్యాయి. తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఉంటుందని తనే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ఆయన తో చర్చలు జరిగాయని, దానికి సంబంధించిన కథ కూడా సిద్దం అవుతుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పాడు. ఇంకా చెబుతూ తన సొంత బ్యానర్లో సుమంత్ అశ్విన్ తో తొలి సినిమా ఉంటుందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles