Venkatesh out of ramcharan krishnavamsi film

Ram Charan, Krishna Vamsi Movie Story, venkatesh movies, venkatesh and ram charan, Ram Charan and Venkatesh, Multi starrer movies, Venkatesh, Victory Venkatesh, Ram Charan

Venkatesh out of Ram Charan and Krishna Vamshi Multistarrer film.

వెంకటేష్ తప్పుకున్నాడు....

Posted: 12/11/2013 01:46 PM IST
Venkatesh out of ramcharan krishnavamsi film

అసలే సరైన హిట్లు లేకుండా సతమతం అవుతున్న దర్శకుడు కృష్ణ వంశీ - రామ్ చరణ్ లకు అస్సలు కాలం కలిసి రావడం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర రామ్ చరణ్ పోషిస్తుండగా, మరో పాత్ర హీరో వెంకటేష్ పోషించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

త్వరలో షూటింగు కూడా ప్రారంభించాలని అనుకుంటున్న ఈ చిత్ర యూనిట్ కి వెంకీ షాక్ ఇచ్చాడని తాజా సమాచారం. ఈ ప్రాజెక్టు నుండి వెంకటేష్ తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇప్పుడు శ్రీకాంత్ ని తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నుండి వెంకటేష్ తప్పుకోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు సినీ జనాలు.

హీరో వెంకటేష్ కి అందులో సరైన పాత్ర ఇవ్వనందుకే అసంత్రుప్తితో తప్పుకున్నాడని, రామ్ చరణ్ కే కథలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం, బల్క్ డేట్స్ కావాల్సి రావటంతో వెంకటేష్ తప్పుకోవటానికి కారణాలను కొంత మంది చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం వెంకీ సరసన నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే హిందీ చిత్రాల రీమేక్ లలో నటించొద్దని డిసైడ్ అయ్యిన వెంకీ ఇక పై మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించకూడదని కూడా అనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles