Chandini chowdary to act with ram charan

Chandini Chowdary big offer in krishna vamsi movie, Chandini Chowdary to Act with Ram Charan, Chandini Chowdary, heroine for Ramcharan movie, Krishna vamsi film

Chandini Chowdary big offer in krishna vamsi movie, Chandini Chowdary to Act with Ram Charan, Chandini Chowdary, heroine for Ramcharan movie, Krishna vamsi film

చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది ?

Posted: 12/06/2013 11:49 AM IST
Chandini chowdary to act with ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో కృష్ణవంశీ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగు ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ , వెంకటేష్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పదహారణాల తెలుగమ్మాయి కోసం వేట సాగించిన దర్శకుడు చివరికి అచ్చ తెలుగు అమ్మాయిని సెలక్ట్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే పలువుర్ని చూసిన దర్శకుడు చివరకు చాందిని చౌదరి అనే అందాల భామను చరణ్ కి ఎంపిక చేశారని ఈ అమ్మాయి తెలుగు చరణ్ కి సరిజోడిగా బాగా కుదురుతుందని ఆమె రూపలావణ్యం ... హావభావాలు .. తమ చిత్రంలోని కథానాయిక పాత్రకు సరిగ్గా సరిపోతాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక వెంకటేష్ సరసన జోడి కోసం వేట కొనసాగిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథానాయికల సమాచారం అధికారికంగా వెలువనుందని అంటున్నారు.

ఇప్పటికి పలు లఘు చిత్రాల్లో నటించిన చాందిని తొలిసారిగా మెగా హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిందంటే ఆమె లైఫ్ టైర్న్ అయినట్లే అని  మెగా ఫ్యాన్స్ అంటుంటే... పాత రికార్డుల ప్రకారం మెగా హీరోలతో తొలి ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణించిన ధాఖలు లేవని కూడా గుర్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles