Hero sunil wants to play villian

Hero Sunil wants to play villian, bhakta kannappa,maryada ramanna,nuvvu naaku nachavu,nuvvu nenu,s s rajamouli,sunil varma

Comedian-turned-actor Sunil Varma is currently enjoying his recently acquired status of a lead actor, says he doesn’t mind playing a villain if a good opportunity comes his way.

రాజమౌళి సినిమాలో విలన్ గా చేస్తా

Posted: 12/02/2013 04:12 PM IST
Hero sunil wants to play villian

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమేడియన్ గా కెరియర్ ప్రారంభించి అనతి కాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సునీల్ ఎంతో కష్టపడి హీరోగా మారి సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా సినిమాల్లో చేసినా ఆయన కమేడియన్ గానే ప్రేక్షకుల్ని అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

ఆ మధ్యన వచ్చిన ‘తడాఖ’ సినిమా మంచి విజయం సాధించడంతో పలు సినిమాలతో బిజీగా ఉన్న సునీల్ ఇప్పుడు విలన్ పాత్రలు కూడా చేయడానికి సిద్దం అంటున్నాడు. మంచి పాత్రలు దొరికితే విలన్ పాత్రలు చేయడానికైనా సిద్దం అని చెబుతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం అంటే తనకు చెప్పలేనంత అభిమానం ఉందని, ఆయన సినిమాల్లోనే విలన్గా కూడా చేయాలని ఉందని చెప్పాడు.

హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు ఇచ్చిన రాజమౌళి ప్రస్తుత చిత్రంలో విలన్గా చేసే అవకాశం వచ్చిందంటే మాత్రం తప్పకుండా సంతోషంగా విలన్గా చేస్తానని సునీల్ అన్నాడు. ఇతర సినిమాల్లోనైనా విలన్గా చేయడానికి తనకు అభ్యంతరం లేదని అంటున్నాడు. మరి రాజమౌళికి కూడా సునీల్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ సినిమాలో సునీల్ కి విలన్ పాత్ర ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles