Actress samantha affected by skin allergy again

Actress Samantha affected by Skin Allergy Again, Samantha affected by Skin Allergy Again, Samantha Ruth Prabhu, Samantha Health Condition, Samantha in Surya and Lingusamy movie, Skin Allergy,Samantha,Shankar

Actress Samantha affected by Skin Allergy Again, Samantha affected by Skin Allergy Again, Samantha Ruth Prabhu, Samantha Health Condition, Samantha in Surya and Lingusamy movie, Skin Allergy,Samantha,Shankar

సమంతాకు మళ్లీ మాయదారి రోగం

Posted: 12/02/2013 09:47 AM IST
Actress samantha affected by skin allergy again

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంతాకి మళ్లీ మాయదారి రోగం మొదలైంది. గతంలో కొన్ని నెలల పాటు స్కిన్  ఎలర్జీతో బాధపడి షూటింగులకు దూరంగా ఉండటమే కాకుండా, ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటించే గొప్ప అవకాశాల్ని కోల్పోయింది. షూటింగుల్లో ముఖానికి పూసుకునే రంగుల్లో ఉండే కెమికల్స్ వలన, షూటింగులో ఉపయోగించే లైట్స్ ఫోకస్ వలన ముఖం, శరీరం ఎరుపు రంగు మచ్చల్లా మారడమే కాకుండా అనారోగ్యానికి కూడా గురైన ఈ అమ్మడు అంత్యంత ఖరీదైన వైద్యం చేయించుకొని కోలుకున్న తరువాత తిరిగి షూటింగుల్లో బిజీ అయింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్షణం తీరిక లేకుండా నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తొలిసారిగా తమిళ హీరో సూర్య సరసన లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగు ముంబయిలో ప్రారంభం అయింది. ఆ షూటింగులో సమంతాకు మళ్లీ స్కిన్ ఎలర్జీ రావడంతో షూటింగును వాయిదా వేసినట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గతంలోనే కొన్ని నెలల పాటు విరామం తీసుకున్న సమంతా ఇప్పుడు మళ్ళీ ఎన్నిరోజులు తీసుకుంటుందో అని దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

వీరే కాకుండా మిగతా సినిమాల వాళ్లు కూడా కంగారు పడుతున్నారు. ఈ మాయదారి రోగం తగ్గేదెప్పుడో మళ్ళీ షూటింగులో చేరేదెప్పుడో అని సమంతా లోలోపల మదన పడుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles