Krrish 3 movie collections have crossed rs 500 crores

Rakesh Roshan,Krrish 3,Hrithik Roshan,entertainment,Bollywood Krrish 3 collections Rs.500 crores,

Krrish 3 box-office collections have been inflated, director Rakesh Roshan begs to differ.

బాలీవుడ్ లో క్రిష్ -3 రికార్డులు

Posted: 11/23/2013 10:47 AM IST
Krrish 3 movie collections have crossed rs 500 crores

భాలీవుడ్ సినిమాలు మొన్నటి వరకు 100 కోట్ల క్లబ్బును ఈజీగా చేరేవి. ఇఫ్పుడు అవి కాస్త 300 క్లబ్బును కూడా దాటాయి. ఇప్పటి వరకు బాలీవుడ్ లో చెన్నై ఎక్స్ ప్రెస్ 400 కోట్ల క్లబ్బును అందుకొని అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ రికార్డును బద్దలు కొట్టి సంచలనం రేపింది. కానీ ఇటీవల వచ్చిన హృతిక్ రోషన్ సినిమా క్రిష్ -3 అన్ని రికార్డులను చెరిపేస్తూ... ఏకంగా 500 క్లబ్బును దాటిపోయిందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

రాకేశ్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాక్ పరంగా పెద్దగా లేకపోయినా, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ పోతుంది. అయితే బాలీవుడ్ జనాలు ఈ సినిమా కలెక్షన్లను చిత్ర నిర్మాత ఎక్కువ చేసి చెబుతున్నాడంటూ మీడియాలో వార్తలు రావడంతో దీని పై రాకేష్ రోషన్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకున్నాడు. ఏదైనా ఒక సినిమా కలెక్షన్స్‌ని ఎక్కువ చేసి చెప్పడం జరుగుతుంది అని అనుకోవడం అసాధ్యం అంటూ విమర్శల్ని కొట్టిపారేశారు.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు డిస్ర్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి తనకు రిపోర్ట్ వస్తుందని, ఆ లెక్కల ప్రకారమే 500 కోట్లు దాటాయని చెబుతున్నానని అంటున్నారు. బాలీవుడ్ ఈ సినిమా ఇన్ని వసూళ్ళు సాధించడం అభినందించాల్సిన విషయమే అయినే వాటిని అధికారికంగా చూపిస్తే బాగుంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles