Bobbili puli movie producer vadde ramesh died

Vadde Ramesh, dies, passed away, vadde naveen father, Bobbili Puli movie Producer, Vadde Ramesh dies in Hyderabad

Tollywood producer Vadde Ramesh died at the KIMS hospital in Hyderabad on Thursday.

బొబ్బిలిపులి నిర్మాత ఇకలేరు

Posted: 11/21/2013 05:16 PM IST
Bobbili puli movie producer vadde ramesh died

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంచి కళా కారులను కోల్పోతుంది. శ్రీహరి, ఏవీఎస్ లాంటి వారి మరణాలు మరవక ముందే మరో ప్రముఖ నిర్మాతను కోల్పోయింది. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత అయిన వడ్డే రమేష్ (66) కేన్సర్ వ్యాధితో కన్ను మూశారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు.

వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన ఈరోజు సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నళిని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రముఖ నటుడు వడ్డే నవీన్ తండ్రి అయిన రమేష్ గతంలో పలు హిట్ చిత్రాలు రూపొందించారు.

ఈయన సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బొబ్బిలి పులి , చిరంజీవి హీరోగా లంకేశ్వరుడు,  కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య వంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘బొబ్బిలి పులి ’ నిర్మాతగా పేరొందాడు.  ఆయన మృతిపట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles